మహారాష్ట్ర రాష్ట్ర రాజకీయాలు ఎవరి ఊహలకి అందని విధంగా రోజుకొక రీతిలోకి మారుతున్నాయి. అధికారం ఒకసారి ఒక పార్టీ దగ్గరుంటే పక్క రోజే ఇంకొక పార్టీ చెంతకు వెళ్తుండగా ప్రస్తుతం రాష్ట్రంలో చక్రం చెప్పి అవకాశాన్ని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అందుకున్నాడు. అసలు ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చిన తర్వాత శరద్ పవార్ తాను ఈ స్థితిలో ఉంటానని కనీసం కలలో కూడా అనుకొని ఉండడు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న పవార్ యొక్క ఎన్సిపి పార్టీ 54 స్థానాలను సార్వత్రిక ఎన్నికల్లో గెలుచుకుంది.

దాదాపు 36 ఏళ్లుగా బిజెపితో కలిసి కొనసాగుతున్న శివసేన ఒక్కసారిగా సీఎం కుర్చీ విషయంలో సందిగ్ధత నెలకొనడం.... చివరికి బిజెపితో పొత్తు కుదరక మంతనాలన్నీ విఫలమయి వారితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విముఖత వ్యక్తం చేసింది. దాంతో బిజెపి కూడా గవర్నర్ ఇచ్చిన ఆహ్వానాన్ని తాము ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితిలో లేమని తిరస్కరించారు. తర్వాత అవకాశం రెండో పెద్ద పార్టీ శివసేన వద్దకు వెళ్లగా వారు కాస్తా ఎన్సీపీ మరియు కాంగ్రెస్ తో మద్దతు కోరడానికి ఎక్కువ సమయం తీసుకోవడంతో మీరు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తానన్నా ఆ గడువు ముగిసిపోయింది అని చెప్పి గవర్నర్ షాక్ ఇచ్చాడు. 

దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తదుపరి అవకాశం ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ వద్దకు వెళ్లింది. శివసేన, ఎన్సీపీ మరియు కాంగ్రెస్ లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శరద్ పవర్ ఛాన్స్ దొరికినప్పటి నుంచి తీవ్రంగా పాటుపడ్డాడు. ఇప్పుడు స్వయంగా అధికారమే తన గుప్పిట్లోకి వచ్చిన నేపథ్యంలో ఇక ఆలస్యం చేయకుండా కాంగ్రెస్ తో కలిసి శివసేన మద్దతు కోరుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో ఇప్పుడు అతను అతని పార్టీ మరియు ఎమ్మెల్యేల డిమాండ్స్ గురించి కూడా పూర్తి స్థాయిలో చర్చలు జరిపి క్లారిటీ తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుపుతున్నాడు. కాబట్టి ఎట్టకేలకు రానున్న 24 గంటల్లో మనం మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వాన్ని చూడడం దాదాపు ఖరారైనట్లే.


మరింత సమాచారం తెలుసుకోండి: