మహారాష్ట్రలో రాజకీయాలు క్షణక్షణానికి మారుతున్నాయి. నవంబర్ 8 వ తేదీతో మహా ప్రభుత్వం గడువు ముగిసింది.  రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ఆహ్వానించింది.  కానీ, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు  చేయలేనని చెప్పింది.  దీంతో మహాలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనీ శివసేనను ఆహ్వానించింది.  శివసేన సమ్మతించి  దానికి సంబంధించిన  ఏర్పాట్లు చేసుకునేందుకు సిద్ధం అయ్యింది. ,అయితే, ప్రభుత్వం ఏర్పాటుకు సోమవారం రాత్రి 7:30 వరకు మాత్రమే గడువు ఇచ్చింది. 


అయితే, సంకీర్ణం కోసం ప్రయత్నం చేస్తున్నామని, అన్ని పార్టీలను కలిసి మాట్లాడటానికి సమయం పడుతుందని, 48 గంటల సమయం ఇవ్వాలని కోరింది.  కానీ, గవర్నర్ అందుకు సుముఖంగా లేరు.  7:30 గంటల లోపే నిరూపించుకోవాలని లేదంటే... కుదరదని గవర్నర్ స్పష్టం చేశాడు.  శివసేన సమయానికి బలనిరూపణకు సంబందించిన లెటర్స్ ఇవ్వలేదు కాబట్టి, ఇప్పుడు ఎన్సీపీని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ ఆహ్వానించాడు.  


ఎన్సీపీకి 24 గంటల సమయం ఇచ్చాడు. రేపు సాయంత్రం 7:30 గంటల లోపు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని గవర్నర్ పేర్కొన్నారు.  ఎన్సీపీ పావులు కదపడం మొదలుపెట్టింది.  కాంగ్రెస్, ఎన్సీపీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యం.  ఇప్పుడు శివసేన సపోర్ట్ కావాలి.  శివసేనకు అవకాశం వచ్చినపుడు ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ఆలస్యం చేశారు.  అందుకే శివసేన అవకాశాన్ని పేర్కొన్నది.  


అదే శివసేన బీజేపీతో కలిసి ఉన్నట్టయితే ఈపాటికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉండేది.  అధికారంలో శివసేన కూడా ఉండేది.  కానీ, శివసేన అత్యాశకు పోయి బీజేపీతో పేచీ పెట్టుకుంది.  పేచీ పెట్టుకొని, బయటకు వచ్చి సొంతంగా ప్రభుత్వంను ఏర్పాటు చేసుకోవాలని చూసింది.  గవర్నర్ పిలుపును అందుకొని పరుగులు తీసిన శివసేనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కుదరలేదు.  ఇప్పుడు ఎన్సీపీ వంతు వచ్చింది.  శివసేన ఎన్సీపీకి మద్దతు ఇస్తుందా చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: