మహారాష్ట్ర లో గంట , గంటకు  రాజకీయం రసకందాయంగా మారుతోంది . మహారాష్ట్ర లో ప్రభుత్వ ఏర్పాటుకు తొలుత బీజేపీ ని ఆహ్వానించిన గవర్నర్ భగత్ సింగ్  కొష్యారి ,  బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకురాకపోవడం తో చేసేదిలేక శివసేన ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు . శివసేన నాయకత్వం  ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసినా, తమకు మరో  48 గంటలు సమయం కావాలని గవర్నర్ ను కోరింది .


కానీ 48 గంటలు సమయం ఇచ్చేందుకు గవర్నర్ నిరాకరించడమే  కాకుండా,  ఎన్సీపీ ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ , శివసేన కు గట్టి షాక్ ఇచ్చారు . ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్య బలం ఉందని శివసేన నేతలు ఏక్ నాథ్ షిండే , ఆదిత్య థాకరే లు  పేర్కొన్నప్పటికీ , దానికి  సంబంధించిన లేఖలు మాత్రం ఇవ్వడానికి 48 గంటలు సమయం కావాలని అడిగారు . అయితే  డెడ్ లైన్ ను పొడిగించ లేమన్న గవర్నర్ , ఎన్సీపీ ని ప్రత్యామ్నాయ  ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించారు . అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ , శివసేన కూటమిగా పోటీ చేశాయి . ఏ పార్టీ కి సంపూర్ణ మెజార్టీ రాకపోవడం తో , ప్రభుత్వ ఏర్పాటు కు అన్ని పార్టీలు పోటీపడ్డాయి .


 బీజేపీ తో మైత్రిని కాదనుకున్న   శివసేన నాయకత్వం , ఎన్సీపీ తో కలిసి  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని  భావించింది  . ఈ కూటమి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ బయట  నుంచి  మద్దతునివ్వాలని నిర్ణయించిందని తెల్సింది . అయితే కాంగ్రెస్ నాయకత్వం  అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు . దాంతో తమకు మద్దతునిన్చే పార్టీ నాయకత్వ లేఖలు ఇచ్చేందుకు శివసేన, గవర్నర్ ను  మరో 48  గంటలు గడువు కోరినట్లు  తెలుస్తోంది .


మరింత సమాచారం తెలుసుకోండి: