మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు, పూటకో ట్విస్టు అన్నట్టుగా తయారయ్యాయి. నిన్నటి వరకూ శివసేన ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే కాంగ్రెస్, ఎన్సీపీ మాట్లాడుతూ వచ్చాయి. కానీ చివరి నిమిషంలో కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేయడం శివసేన కొంప ముంచింది. సరిగ్గా గవర్నర్ వద్దకు వెళ్లే ముందు కూడా ఆ పార్టీ మాట మార్చేసింది.


సోమవారం రాత్రి ఏడున్నర కల్లా గవర్నర్ ను తమకుబలం ఉందని నమ్మించలేకపోయన శివసేన మరింత గడువు కావాలని కోరింది. అందుకు తిరస్కరిచిన గవర్నర్ తాజాగా ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీని ఆహ్వానించారు. గవర్నర్ కోషియారి ఇచ్చిన నిర్దిష్ట సమయం ముగిసే సరికి శివసేన ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన బలాన్నిచూపలేకపోయిం.


దాంతో ఆయన మూడో పెద్ద పార్టీ అయిన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానం అందచేశారు. ఈ పార్టీకి కూడా 24 గంటల గడువు పెట్టారు. పెద్ద పార్టీలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే ఈ పార్టీ ఏమి చేస్తుందన్నది చర్చనీయాంశం. దీంతో గవర్నర్ తీరుపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రపతి పాలన పెట్టడానికి ముందుగా గవర్నర్ ఇలా ప్రవర్తిస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.


ఇప్పుడు మహా రాజకీయాల్లో ఏం జరుగుతుందన్నది అర్థం కాకుండా ఉంది. తిరిగి శివసేన, బిజెపి జట్టు కట్టక తప్పని పరిస్థితి ఏర్పడుతుందా? లేక వేరే ప్రత్యామ్నాయం వస్తుందా? అన్నది చర్చనీయాంశంగా ఉంది. ఇంత జరిగాక ఇంకా బీజేపీ, శివసేన జట్టు కట్టడం అన్నది దాదాపు అసాధ్యం.


కాంగ్రెస్ కలసి వస్తే.. ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ కూటమి మరోసారి గవర్నర్ ను కలిసి తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వనించమని కోరవచ్చు. లేనిపక్షంగా గవర్నర్ రాష్ట్రపతిపాలన విధించి.. మళ్లీ ఎన్నికలకు మార్గం సుగమం చేసే అవకాశమూ లేకపోలేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

సో

మరింత సమాచారం తెలుసుకోండి: