ఏపీ సీఎం వైఎస్ జగన్ జనంపై వరాల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. ఓవైపు ఖజానా ఖాళీగా ఉందని పత్రికలు ఊదరగొడుతున్నా జగన్ జోరు మాత్రం తగ్గడం లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన మరో హామీని వైఎస్ జగన్  నెరవేర్చారు. ఆయన తన పాదయాత్రలో ఇచ్చి హామీకి అనుగుణంగా విఓఏ, సంఘమిత్ర తదితరులకు జీతాలు పెంచారు.


ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్‌.. వీ ఓ ఏ, మెప్మా, యనిమేటర్లు, సంఘమిత్రాల వేతనం 10 వేలకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవోని జారీ చేసింది. ఇలా పెంచిన వేతనం డిసెంబర్‌ 1 నుంచి అమల్లోకి రానుంది. వేతన పెంపుతో సంబంధిత శాఖల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు చిరుద్యోగుల జీతాలు పెంచేశారు. హోంగార్డులనూ కనికరించారు. తాజాగా ఇప్పుడు విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్‌.. వీ ఓ ఏ, మెప్మా, యనిమేటర్లు, సంఘమిత్రాల వేతనం 10 వేలకు పెంచేశారు.


వైఎస్ జగన్ మొదటి నుంచి సక్షేమం విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. తన ప్రభుత్వ ప్రయారిటీలను ఆయన ఎన్నికల ముందే ప్రజలకు వివరించాడు. అందులో భాగంగా పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకే ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని కొన్ని అంశాలైతే.. పాదయాత్రతో సంబంధం లేకుండా తీసుకున్నవి కూడా ఉన్నాయి.


ప్రభుత్వానికి చేరుతున్న సొమ్ము.. మళ్లీ ప్రజల వద్దకే చేర్చేలా వైఎస్ జగన్ ప్రణాళికలు రచిస్తున్నారు.మరోవైపు రాష్ట్ర ఖజానా నిండుకుందని తెలుగు దేశం పత్రికలు ఊదరొట్టడం ప్రారంభించాయి. అయితే ఏది ఏమైనా తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చి తీరాలని సీఎం వైఎస్ జగన్ గట్టిపట్టుదలతో ఉన్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: