మనిషికి ఉన్న ఆశ ఎక్కడి వరకైన తీసుకెళ్లుతుందని మనం చాలా సార్లు వినే ఉంటాం. అందుకే అంటారు అత్యాశ అన్ని అనర్ధాలకు మూలమని. ఇకపోతే ఇప్పుడున్న సమాజంలో ప్రతి వ్యక్తి తనలోని కోరికలను అణచుకోలేక వాటిని తీర్చుకోవడానికి ఎంతటి సాహసం చేయడానికైన వెనుకడుగు వేయడం లేదు. అది ఎలాంటి విషయమైన ఒక్క సారి తాను పొందాలనుకుంటే ఒక్కోసారి తన నూరెళ్ల జీవితాన్ని కూడ పణంగా పెడుతున్నాడు.


ఇక సమాజంలో ఆధునిక జీవనానికి అలవాటుపడి తానో మనిషి అన్న ధ్యాస లేకుండా జీవిస్తున్నాడు. ఆడ, మగ అనే తేడా లేకుండా అందరు తమ ప్రవర్తనలో మార్పు తెచ్చుకున్నారు. ఇకపోతే ఒక మహిళ మద్యం తాగుదామని ఆశించి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి నిండా మునిగింది. సాటి మనిషికి రూపాయి కూడ సహయం చేయరు కాని ఆన్‌లైన్లో వేయిలకు వేయిలు మునిగిన బాధలేదంటారు కొందరు. ఇక విషయానికి వస్తే కోల్‌కతాకు చెందిన 32ఏళ్ల మహిళా ఇంజనీర్‌ నాలుగురోజుల క్రితం పుణే వెళ్లారు.


బవ్ధాన్‌లోని తన స్నేహితులను కలిసిన ఆమె.. వారితో పార్టీ చేసేందుకు సమీపంలోని బార్‌కు వెళ్లగా, అయితే అయోధ్య తీర్పు సందర్భంగా ఆ రోజు మద్యం దుకాణాలు బంద్‌ చేశారు. దీంతో స్నేహితులతో కలిసి ఇంటికి వెళ్లిన ఆమె ఎలాగైనా పార్టీ చేసుకోవాలని డిసైడ్‌ అయ్యారు. ఆన్‌లైన్‌లో మద్యం డెలివరీ కోసం వెతకగా, ఒక మొబైల్‌ నెంబర్‌ కనిపించడంతో దానికి ఫోన్‌ చేశారు. ఫోన్‌ రిసీవ్‌ చేసుకున్న సదరు కేటుగాడు.. మద్యం దుకాణాన్ని మూసేశామని, ఈ సమయంలో ఆల్కహాల్‌ దొరకడం కష్టమని తెలుపగా పుట్టిన కోరికను అనుచుకోలేక ఎలాగైనా తనకు ఆల్కహాల్‌ కావాలని సదరు మహిళ కోరింది.


దీంతో ఈ బేరాన్ని అవకాశంగా తీసుకున్న ఆ దొంగ చాల తెలివిగా ముందుగానే  ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించాలని చెప్పాడు. దీనికి ఒకే చెప్పిన మహిళా సాఫ్టవేర్‌... వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ)ను ఆ అగంతకుడుకి చెప్పేశారు. అలా చెప్పిన కొద్ది నిమిషాల్లోనే ఆమె బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి రూ.31,777 విత్‌డ్రా అయినట్లు మెసేజ్‌ వచ్చింది. దీంతో ఆమె ఆ అగంతకుడికి ఫోన్‌ చేసి వివరణ అడిగారు. పొరపాటు జరిగిందని, మరోసారి ఓటీపీ చెప్తే అమౌంట్‌ జమ చేస్తానని నమ్మించాడు.


దీంతో ఆమె మరోసారి ఓటీపీ చెప్పింది. మళ్లీ రూ.19,001 విత్‌డ్రా చేసేశాడు. మెసేజ్‌ చూసుకున్న ఆమె అతనికి ఫోన్‌ చేయగా.. అందుబాటులోకి రాలేదు. మోసపోయానని తెలుసుకున్న సదరు మహిళ.. స్నేహితులతో కలిని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పుణే పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇకపోతే చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం తనలో కలిగిన కోరిక విలువ 50000 వేల రూపాయలు. ఆ దొంగకు సంతోషం కలిగించింది. తాను మాత్రం మోసపోయిందని ఇప్పుడు బాధ పడుతుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: