గన్నవరం ఎమ్మెల్యే వంశీ టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్నట్టు ఇప్పటికే అందరికీ అర్ధం అయిపొయింది. అయితే వంశీ ఇంకా ఎందుకో సస్పెన్స్ మైంటైన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి వంశీ రాజీనామాల వ్యవహారాలు కాస్త సైలెంట్ అయినా ఆయన పార్టీ మారాలంటే అటు తాను తన ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను ఆమోదింపజేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిగ్గా ఉప ఎన్నిక తప్పదు. అయితే వంశీ కొద్ది రోజులుగా పార్టీలో ఉండాలా ?  లేదా ?  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్లాలా ? అనే విషయంలో డ్రామాలు ఆడుతున్నట్టే కనిపిస్తోంది. తెలంగాణలోని హైదరాబాద్లో వంశీకి ఉన్న వివాస్పద ఆస్తుల విషయంలో కేటీఆర్ ద్వారా తనకు ఫేవర్ చేయాలన్న వంశీ కండీషన్కు జగన్ ఒప్పుకోకపోవడంతోనే వంశీ టీడీపీ రాజీనామా పెండింగ్లో ఉందట.


అయితే వంశీ  టీడీపీని మారడానికి మొత్తం రంగం సిద్ధమయ్యిందని తెలుస్తుంది. వంశీ పార్టీ మారితే గన్నవరంలో ఉప ఎన్నిక వస్తుందన్నది తెలిసిందే. అప్పడు అక్కడ టీడీపీ నుంచి పోటీ చేసేందుకు సరైన అభ్యర్థి కూడా దొరికే పరిస్థితి లేదు.నిన్న మొన్నటి వరకు గన్నవరంలో ఉప ఎన్నిక జరిగితే పోటీ చేసేందుకు టీడీపీ నుంచి చాలా మంది పేర్లే వినిపించాయి. అయితే ఇప్పుడు వారెవ్వరు ఇక్కడ పోటీ చేసేందుకు ఎంత మాత్రం ఇష్టపడడం లేదని తెలుస్తోంది. ముందుగా తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ పేరు ప్రముఖంగా వినిపించింది.


అయితే దేవినేని అవినాష్ గుడివాడలో పోటీ చేయడానికి అంతగా ఆసక్తిని కనబర్చడం లేదని తెలుస్తుంది. గుడివాడలో ఓడి కోట్లాది రూపాయలు పోగొట్టుకున్న అవినాష్ మళ్లీ నియోజకవర్గం మారితే పెనమలూరు లేదా విజయవాడ తూర్పు మీదే ఆసక్తితో ఉన్నారే తప్పా గన్నవరంలో ఆయన పోటీకి ఇష్టపడడం లేదు.ఇక జిల్లాపరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధను అక్కడి నుంచి బరిలోకి దించాలని చంద్రబాబు భావించినా ఆమె భర్త తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వద్దని చెప్పారట. తాము అక్కడ పోటీ చేసేందుకు సిద్ధంగా లేమని నేరుగా బాబుకే చెప్పేశారట. ఇక మాజీ మంత్రి దేవినేని ఉమా ఆప్షన్గా ఉన్నా.. ఉమాకు గన్నవరం పరిస్థితులు పూర్తిగా తెలుసు. 

మరింత సమాచారం తెలుసుకోండి: