కాంగ్రెస్ పార్టీ గ్రాండ్ ఓల్డ్ పార్టీ. ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నికల్లో ఘోర ఓటమిని చవి చూసి బాధపడుతున్న పార్టీ.  దేశంలో ఎన్నో ప్రాంతాయ పార్టీలున్నాయి. వాటిల్లో కొన్నింటితో కాంగ్రెస్ మితృత్వాలు శతృత్వాలు నడిపింది. ఆఖరికి కమ్యూనిస్టులతో కూడా కొంత కాలం పాటు సన్నిహితంగా మరి కొంత కాలం పాటు వ్యతిరేకంగా వ్యవహరించింది. ఇలా కాంగ్రెస్ కు  కూడా మిత్రులు శత్రువులు మారుతూ వచ్చారు. ఆఖరికి దశాబ్దాల రాజకీయ శత్రువు చంద్రబాబుతో కూడా కాంగ్రెస్ చేతులు కలిపింది. మొదటికే మోసం తెచ్చుకుంది. ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు శివసేనతో చేతులు కలిపితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా తయారవుతుంది? అనేది ఆసక్తిదాయకమైన చర్చ! 


శివసేన కూడా కాషాయ పార్టీనే .. కాంగ్రెస్ కు శివసేనకు సిద్ధాంత పరమైన విభేదాలు ఉన్నాయి. శివసేనకూడా మొదటి నుంచి అందుకు అనుగుణంగా అది దశాబ్దాలుగా బీజేపీ సన్నిహిత పార్టీగా నిలిచింది. బీజేపీతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది బీజేపీ నేతలతో సేన నేతలు చాలా సన్నిహితంగా మెలిగారు. ఎన్ని తిట్టుకున్నా విమర్శించుకున్నా బీజేపీతోనే సాగారు. అయితే ఇప్పుడు శివసేన తన పదవీ కాంక్షతో కాంగ్రెస్ తో చేతులు కలుపడానికి సై అంటోంది.అది కూడా ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా శివసేన బీజేపీతో కలిసి పోటీచేసింది. అయితే ఇప్పుడు రూటు మార్చింది.


శివసేన ఇప్పుడు అధికారం కోసం కాంగ్రెస్ తో కూడా చేతులు కలపడానికి ప్లాన్ చేసినిది. శివసేన సంగతేమో కానీ ఈ పొత్తుతో కాంగ్రెస్ పరిస్థితి ఏమవుతుంది?  అనేది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న.ఎన్నడూ లేని రీతిలో కాషాయ పార్టీతో చేతులు కలిపి కాంగ్రెస్ పార్టీ హిందుత్వ అనుకూల  ఇమేజ్ పొందుతుందా? లేక అసహజమైన మైత్రితో కొత్త ఇబ్బందుల్లో పడుతుందా? అనేది ముందు ముందు తెలిసే రాజకీయ పరమైన అంశం అని పరిశీలకలు వ్యాఖ్యానిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: