రోజురోజుకు ప్రాంక్  చేసే వారి సంఖ్య ఎక్కువ అయిపోతుంది.ప్రస్తుతం ఇదొక ట్రెండ్ అయిపొయింది.  ఏదో ఒక ప్రాంక్  చేసి జనాలను బురిడీ కొట్టించడం... ఆ వీడియోలను  సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి  డబ్బులు సంపాదించడం. ప్రస్తుతం ప్రాంక్  చేయడం ఓ వృత్తి అయిపోయింది. రోజుకు వినూత్న మైన ప్రాంక్ తో తెర  మీదకు వస్తున్నారు ప్రాంక్ చేసేవాళ్ళు . అయితే బిన్నంగా ప్రాంక్ చేయటం వల్ల  ఎక్కువగా ఫెమస్ అవ్వొచ్చని  డిఫరెంట్  డిఫరెంట్ ప్రాంక్ లను  కూడా ట్రై చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే కొన్ని కొన్ని సార్లు ప్రాంక్ లు   ఫెయిల్ అయి ఇబ్బందులకు గురవుతుంటారు. . ఇక్కడ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 

 

 

 

 ప్రాంక్ వీడియోలు చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ఫేమస్ అయిపోయి డబ్బులు సంపాదించాలని భావించారు బెంగళూరుకు చెందిన యువకులు. చాలా మందిని  ఇప్పటికే చాలా ఫ్రాంక్ వీడియోలు చేసి జనాలను బురిడీ కొట్టించాడు కూడా. అయితే తాజాగా డిఫరెంట్ ప్రాంక్  ప్రయత్నించాలని అనుకున్నారు కానీ డిఫరెంట్ గా ట్రై చేస్తున్న ప్రాంక్ కాస్త  బెడిసి కొట్టింది. దీంతో కటకటాల పాలయ్యారు. దయ్యాల వేషాలు వేసుకుని రాత్రివేళ జనని భయపెడుతూ ప్రాంక్ చేస్తున్న యువకులను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాంక్  వీడియోలు కోసం బెంగళూరులోని ఆర్టీనగర్,  నగవార ప్రాంతాలకు చెందిన కొందరు యువకులు... దయ్యాలు వేషాలు వేసుకుని నగర శివారులో యశ్వంత్ పురాలో  వీడియోలు చేసేవారు. అటువైపుగా వస్తున్న వాహనదారులను రాత్రిపూట దయ్యం వేషంలో  బయటపెట్టే వారు . 

 

 

 

 బాడీ కనిపించకుండా పూర్తిగా తెల్లని గౌను ధరించి రక్తపు మరకలతో ఆకస్మాత్తుగా రోడ్డుపై వీరు ప్రత్యక్షమయ్యే సరికి జనం హడలిపోయేవారు. భయంతో పరుగులు తీసేవారు . అయితే దీనిని  కొందరు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు  ప్రాంక్  చేస్తున్న ప్రాంతంలో నిఘా  వేసిన పోలీసులు... దయ్యాల వేషంలో  యువకులు ప్రాంక్  చేసేందుకు రోడ్ పైనకి రాగానే  అదుపులోకి తీసుకుని కటకటాల వెనుకకు తోసారు. ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. అయితే వారు చేసేది ప్రాంక్ వీడియోలే అయినప్పటికి...ప్రాంక్  చేసే విధానం ప్రమాదకరంగా ఉండడంతో వారి వల్ల జనాలు  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: