పసిడి ప్రేమికులకు శుభవార్త. బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో గత మూడు రోజుల్లో బంగారం ధర ఏకంగా 300 రూపాయలు తగ్గింది. మంగళవారం కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 50 రూపాయలు తగ్గింది. అంటే బంగారం పది గ్రాముల ధర ఇప్పుడు 39,550 రూపాయలు అయ్యింది.


24 క్యారట్ల తరహాలోనే 22 కార్యెట్ల బంగార ధర కూడా తగ్గింది. 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర 50 తగ్గింది. ప్రస్తుతం ఆ బంగారం ధర 36,250గా ఉంది. బంగారం ధర ఇలా ఉంటే... వెండి ధర మాత్రం ఎగబాకింది. 50 పెరిగింది.. ప్రస్తుతం వెండి కేజీ ధర రూ.48,700కు చేరుకుంది.


హైదరాబాద్ మార్కెట్ కంటే ఢిల్లీ మార్కెట్లో ఇంకా బంగారం ధర బాగా తగ్గింది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.120 తగ్గింది. రూ.38,200కు చేరింది. 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.50 తగ్గింది. రూ.37,000కు దిగొచ్చింది. ఢిల్లీలో కూడా వెండి ధర మాత్రం పెరిగింది. కేజీ వెండి ధర రూ.50 పైకి ఎగబాకింది. ధర రూ.48,700కు చేరింది.


అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ తో పాటు దేశీ జువెలర్ల, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ తగ్గిపోవడం వల్ల బంగారం ధరలు తగ్గినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక వెండి మాత్రం పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ పుంజుకోవడం వల్ల పెరింగిందట. ఢిల్లీ, హైదరాబాద్ తరహాలోనే విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు కూడా ఉన్నాయి.


బంగారం ధరలు ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు వంటి అంశాలతో ప్రభావితం అవుతుంటాయి. అలాగే వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు కూడా బంగారం ధరలను శాసిస్తుంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: