సోమవారం నాడు ఇప్పేరు గ్రామానికి చెందిన కొందరు వృద్ధులు అనంతపురం జిల్లా లోని కూడేరు మండల పరిషద్ డెవలప్మెంట్ ఆఫీసర్ కార్యాలయంకి వెళ్లారు. కార్యాలయం వద్దకు వచ్చిన ఇప్పేరు గ్రామస్తులు పింఛన్ ఇవ్వకపోతే పెట్రోల్ పోసి చంపుతాం అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. 


సబ్-ఇన్స్పెక్టర్ యువరాజ్ తెలిపిన ప్రకారం... ఇప్పేరు గ్రామస్థులైన పెన్నోబులేశు, శివమ్మ, మరో నలుగురు వ్యక్తులు కార్యాలయానికి వెళ్లి.. తమకి ఈ నెల పింఛన్ ఎందుకు ఇవ్వలేదంటూ పంచాయతీ కార్యదర్శి అయినా మురళీకృష్ణను నిలదీశారు. ఇప్పుడు ఇవ్వడం కుదరదు వచ్చే నెల ఇస్తాం అని మురళీకృష్ణ చెప్పాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు.. వచ్చే నెల ఇవ్వకపోయావో... పెట్రోల్ పోసి చంపేస్తాం.. అని బెదిరించారు. దీంతో భయాందోళనకు గురైన అక్కడి అధికారాలు పోలీసులకు ఫోన్ చేసారు. 


విషయం తెలిసిన పోలీసులు వెంటనే కార్యాలయానికి చేరుకొని పెన్నోబులేశు, శివమ్మతోపాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే కార్యాలయం లోకి వెళ్లిన శివమ్మ చేతిలో కొడవలి ఉండడంతో అధికారులు అలెర్టు అయ్యారు. కార్యదర్శి ఇచ్చినా పిర్యాదు నిమిత్తం.. కేసు నమోదు చేసి.. శివమ్మ కొడవలిని కార్యాలయానికి ఎందుకు తెచ్చిందో అని దర్యాప్తు చేస్తున్నారు. 


ఇటీవల తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వ అధికారులపై జరిగిన అవాంఛనీయ దాడులు మన అందరికి విదితమే. ఆ రోజు నుంచి ఎక్కడో ఒక ప్రభుత్వ కార్యాలయం వద్ద ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల నుండి పనులు కావడం లేదంటూ తహసీల్దార్ కార్యాలయాల్లో చాలా మంది ప్రజలు అఘాయిత్యాలకు పాలుపడుతున్నారు. ఇలాంటి భయానకమైన ఘాతుకాలు జరుగుతుండడంతో ప్రభుత్వ అధికారులు డ్యూటీ కి వెళ్లాలంటేనే జంకుతున్నారు. తమకు రక్షణ కల్పించాలంటూ ప్రభుత్వ ఉద్యోగులు గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తున్నారు. సురేష్ రెడ్డి చేసిన హత్యను చూసిన తర్వాత నుంచి సామాన్య ప్రజలు కూడా అతని లాగానే దారుణానికి ఒడిగడతాం అంటూ ప్రతి ఉద్యోగుడిని భయపెట్టడం ఓ హాబీగా మారిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: