తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మరోమారు తన దైన శైలిలో కేసీఆర్ సర్కార్ పై  విమర్శలు గుప్పించారు. న్యూజెర్సీలో ఎన్నారైలు  నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ రేవంత్ రెడ్డి తెలంగాణలో కేసీఆర్ పాలన పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ పాలన బాగుంటే నిజాంబాద్ లో పార్లమెంట్  ఎలక్షన్లలో  ఆయన కుమార్తె కవిత ఎందుకు ఓడిపోతారని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి... మల్కాజిగిరిలో తానెందుకు గెలుస్తా అని తెలిపారు. సమయం సందర్భం వచ్చినప్పుడు... ప్రకృతి తన పని తాను చేసుకుంటూ పోతుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొండగల్లో  తాను ఓడిపోతానని కానీ పార్లమెంట్ ఎలక్షన్లలో  మల్కాజిగిరి ఎంపీ గా గెలుస్తానని కానీ  ఊహించలేదు అని తెలిపారు రేవంత్ రెడ్డి. 

 

 

 

 ఆర్టీసీ కార్మికులు 39 రోజులుగా తమ న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారం  కోసం సమ్మె చేస్తుంటే  కేసీఆర్ మొండి వైఖరితో  వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలేదని అంటున్నారని ఆరోపించిన  రేవంత్... మరి ఆర్టీసీ ని  50శాతం ప్రైవేటీకరణ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కెసిఆర్ చెప్పారా అంటూ నిలదీశారు. కెసిఆర్  కొడుకు అల్లుడు  తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని  చెబుతున్నారని...  కొడుకు అల్లుడు వచ్చి పప్పు అన్నం తిని వెళ్లిపోయారని... ఇక కూతురు బెంజ్ కారులో వచ్చి బతుకమ్మ  ఆడి వెళ్లిపోయిందంటూ  రేవంత్ ఎద్దేవా చేశారు. అంత మాత్రానికి వారు ఉద్యమంలో పాల్గొన్నాం  అని చెబుతున్నారు అని అలా అయితే ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు అర్పించిన వారి సంగతి ఏంటని... వారిని ఏమనాలి...వారి ఋణం  ఎలా తీర్చుకోవాలి అని రేవంత్ ప్రశ్నించారు. 

 

 

 ఎన్నో ఆశలతో టిఆర్ఎస్ పార్టీకి  తెలంగాణలో ప్రజలు అధికారం కట్టబెట్టారని... కానీ తెలంగాణాలో ప్రజలు  ఊహించినట్లుగా పాలన లేదని  రేవంత్ ఆరోపించారు. ఒకవేళ ఇది సివిల్ వార్ కు దారితీసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రేవంత్ అన్నారు. గతంలో అభివృద్ధికి నక్సలైట్లు అడ్డుగా ఉన్నారని అనే వారిని... కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే వారు ఉంటేనే బాగుంటుంది అనే పరిస్థితి వచ్చింది అని రేవంత్ రెడ్డి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: