ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆంధ్ర ప్రజలకు వరాలు ఇస్తూనే ఉన్నాడు. అన్ని విధాలా ప్రజలకు తోడు ఉంటూ.. ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అమలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే గ్రామ సంఘ సహాయకులు (VOA), మురికివాడలు, పట్టణస్థాయి సమాఖ్యాల రిసోర్స్ పర్సన్స్ (RP)ల జీతాలు భారీగా పెంచాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. 


ఈ జీతం పెంపు వేలాదిమంది కుటుంబాలకు శుభవార్త అనే చెప్పాలి. ఈ నిర్ణయంతో దాదాపు 36 వేల మందికి జీతం పెరగనుంది. ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఇచ్చిన అన్ని హామీలను వైసీపీ ప్రభుత్వం ఒకొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా, వీఓఏ, ఆర్పీలకు జీతాలు పెంచుతూ వారికీ శుభవార్త చెప్పింది. జీతం భారీగా పెంచారు కానీ ఎంత అని అనుకుంటున్నారా ?


అయితే ఇప్పటివరకు ఈ ఉద్యోగులకు 5 వేల రూపాయిలు జీతం వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వం ఈ జీతాన్ని రూ. 10,000 రూపాయిలు చేసింది. ప్రభుత్వం నుండి రూ.8వేలు, ఆయా సంఘాలు, సమాఖ్యల నుంచి రూ.2 వేలు గౌరవ వేతనాన్ని ఇస్తాయి. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో 27,797 మంది VOAలకు, 8,034 మంది RPలకు లబ్ది చేకూరనుంది. కాగా ఈ జీతం పెంపు డిసెంబర్ 1వ తేదీ నుంచి అమలు కానుంది. ఈ మేరకు నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఉతర్వులను జారీ చేసింది. 


ఏది ఏమైనప్పటికి సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రన్నీ అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నారు. మరో వైపు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వరాలు కురిపిస్తున్నారు. గతంలో ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అభివృద్ధి సీఎం జగన్ చేస్తున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: