మహారాష్ట్రలో ఏ పార్టీకి సరైన సంఖ్య బలం లేకపోవడంతో రాజ్యాంగ సంక్షోభం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు చేయాల్సిందిగా చేయవల్సిందిగా  గవర్నర్ భగత్ సింగ్ కొష్యారి తొలుత   కోరారు.  అయితే సరైన సంఖ్య బలం లేకపోవడంతో,  ప్రభుత్వ ఏర్పాటుకు బిజెపి నిరాకరించింది.  బిజెపి ప్రభుత్వ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో శివసేనకు అవకాశమిచ్చిన గవర్నర్,  ఆ పార్టీకి మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంఖ్య  బలం పై ఆరా తీశారు . ప్రభుత్వ ఏర్పాటుకు తమకు సరిపోయే ఎమ్మెల్యేల సంఖ్య  బలం ఉందన్న శివసేన,  తమకు 48 గంటల సమయాన్ని ఇస్తే ఆయా పార్టీల మద్దతు లేఖలను సమర్పిస్తామని పేర్కొంది.


  కానీ గవర్నర్ సమయాన్ని పొడిగించేందుకు సుముఖత వ్యక్తం చేయకపోగా,  ఎన్సీపీ ని ప్రభుత్వ  ఏర్పాటు కు ఆహ్వానించి కొత్త ట్విస్ట్ ఇచ్చారు .   మంగళవారం రాత్రి  8:30 గంటల్లోగా ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత ఇవ్వాలని ఎన్సీపీకి అయన గడువు విధించారు.  ఈలోగా తమకు  మద్దతు ఇస్తున్న పార్టీల ఎమ్మెల్యేల లేఖలతో  ఎన్సీపీ ప్రభుత్వ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేస్తే సరే ... సరి లేకపోతే రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఉన్నాయని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు.  రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభాన్ని తప్పించేందుకు శివసేనఎన్సీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.  అయితే ఈ రెండు పార్టీలకు కాంగ్రెస్  మద్దతు తప్పనిసరి కావడంతో,  ఆ పార్టీ మద్దతు ఇస్తుందా? లేదా ?? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.


  ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఫోన్లో సంభాషించిన ట్లు సమాచారం.  అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందా ?లేదా?? అన్న అంశం పై మీమాంస నెలకొంది.  ఒకవేళ కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పటికీ,  ఎన్సీపీకి ముఖ్యమంత్రి పీఠాన్ని కేటాయించాలని షరతు  విధించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది . అదే జరిగితే సీఎం పీఠాన్ని అధిష్టించాలన్న  శివసేన నాయకుల కోరిక నెరవేరే అవకాశం ఎంతమాత్రం కనిపించడం లేదు . 


మరింత సమాచారం తెలుసుకోండి: