తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  చేపట్టిన మహత్తర కార్యక్రమం కాలేశ్వరం ప్రాజెక్ట్ . అధునాతన టెక్నాలజీతో రాష్ట్రాన్ని మొత్తం సస్యశ్యామలం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిందే  కాలేశ్వరం ప్రాజెక్ట్ను. కాగా కాలేశ్వరం లోని ఒక్కొక్క పంప్ హౌస్ ను ప్రారంభిస్తూ వస్తుంది తెలంగాణ ప్రభుత్వం. నేడు కాలేశ్వరం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కరీంనగర్ లో పంపు హౌస్ లో  మరో అద్భుత దృశ్యం నేడు ఆవిష్కృతమైంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లోని పంపు హౌస్ లోని  నాలుగు బాహుబలి మోటార్లను ప్రారంభించారు అధికారులు. నాలుగు బాహుబలి మోటార్లను  ఒక్కసారిగా విడుదల చేయడంతో గోదావరి జలాలు  పరవళ్ళు తొక్కుతున్నాయి . 

 

 

 

 మొత్తం కాలేశ్వరం ప్రాజెక్టు లో 12 బాహుబలి మోటార్లు ఉండగా నేడు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం  లక్ష్మీపూర్ లోని గాయత్రి పంపు హౌస్ లోని  నాలుగు బాహుబలి మోటార్లను ప్రారంభించారు అధికారులు. దీంతో కాళేశ్వరంలో మరో అద్భుత జల  దృశ్యం ఆవిష్కృతమైంది. ఒక్కసారిగా 4 బాహుబలి మోటార్లను ప్రారంభించడంతో గోదావరి నీళ్లు ఉదృతంగా పంప్ హౌస్ లోకి దూకుతుంది .మాగాణి  పంటల కోసం అధికారులు ఈ నాలుగు బాహుబలి మోటార్ ప్రారంభించి నీటిని విడుదల చేసినట్లు తెలుస్తోంది. కాగా  ఈ నాలుగు బాహుబలి పంపుల ద్వారా 12,600 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. 

 

 

 

 ఈ నాలుగు మోటార్ల ద్వారా విడుదల చేసిన నీటిని మిడ్ మానేరుకు తరలించటం  జరుగుతోంది.కాగా  నంది పంప్ హౌస్ మూడు మోటార్ ల ద్వారా అధికారులు గాయత్రీ పంపు హౌస్ కీ అధికారులు నీటిని తరలిస్తున్నారు  . నంది పంప్ హౌస్ నుంచి 6,450 క్యూసెక్కుల నీటిని గాయత్రి పంప్ హౌస్ కు తరలిస్తున్నారు అధికారులు.తద్వారా  లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ లో నాలుగు బాహుబలి మోటార్లను  అధికారులు ప్రారంభించగా గోదావరి నీళ్లు ఎగిసిపడుతూ పరవళ్లు తొక్కుతోంది. దీంతో కాళేశ్వరంలో మరో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: