తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు త‌నయుడు, టీడీపీ యువ‌నేత నారా లోకేశ్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అధికారంలో ఉంటే..మీడియా ఎలాగూ ఆ పార్టీని, నేత‌ల‌ను హైలెట్ చేస్తుంది. కానీ ప్ర‌తిప‌క్షంలో ఉంటే అందుకు ఎంతో శ్ర‌మించాల్సి ఉంటుంది. పార్టీ శ్రేణులు చేజారిపోకుండా నిత్యం క‌ద‌న‌రంగంలో ఉంచాల్సి ఉంటుంది. ఇందులో వెన‌క‌బ‌డ్డార‌నే పేరును ఆయ‌న అధికారంలో ఉన్న‌ప్పుడే సంపాదించుకున్నారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు కూడా దాన్ని నిరూపించుకుంటున్నార‌ని...నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.


టీడీపీ అధినేత చంద్ర‌బాబును ఉద్దేశించి గుడ్డ‌లూడ‌దీస్తా అని ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు...తెలుగుదేశం నేత‌లు ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితులకు స‌హాయం విష‌యంలో ఆయ‌న ఈ కామెంట్లు చేశారంటున్నారు. అయితే, ఈ కామెంట్ల‌కు లోకేశ్ ఓ రేంజ్‌లో రియాక్ట‌య్యారు. విలేక‌రుల స‌మావేశంలో అనుకుంటున్నారా?  ఎప్ప‌ట్లాగే...ట్విట్ట‌ర్లో అనుకుంటున్నారా?  కాదు బ‌హిరంగ లేఖతో. సుదీర్ఘంగా మూడు పేజీల లేఖ రాసిన లోకేశ్‌...మా కామెంట్ల‌కు స్పంద‌న‌గా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను టార్గెట్ చేసి....ఆయ‌న గుడ్డ‌లు ఊడ‌దీస్తారా? అని ఘాటు విమ‌ర్శ‌లు...ప‌దునైన కామెంట్లు చేశారు. 


`మీరు ఇటీవ‌ల ఉగాండా వెళ్లారు. మిమ్మ‌ల్ని కుటుంబ‌స‌మేతంగా తాడేప‌ల్లి ఇంటికి పిలిపించుకున్న జ‌గ‌న్ గారు మీ విదేశీ ప‌ర్య‌ట‌న చాలా చ‌క్క‌గా సాగాల‌ని అభిల‌షిస్తూ పుష్ప‌గుచ్ఛం అంద‌జేశారు కూడా. అక్క‌డి స‌ద‌స్సులో మీరు తెలుసుకున్న విలువ‌లు, స‌భామ‌ర్యాద‌లు మ‌న రాష్ట్ర శాస‌న‌స‌భ‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి అనుకున్నాం. అలాంటిది అట్నుంచి వ‌చ్చాక మీరు ఇలా ప్ర‌తిప‌క్ష‌నేత‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌ల వెనుక మ‌ర్మ‌మేంటో చెప్ప‌గ‌ల‌రా? అలాగే అగ్రిగోల్డ్‌తో నాకు సంబంధం ఉంద‌ని కూడా మీరు వ్యాఖ్యానించారు. ప్ర‌భుత్వంలో ఉన్న‌ది మీరే క‌దా!అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతున్నా నాపై చేసిన ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేకపోయారు.గౌర‌వ‌నీయ స‌భాప‌తి స్థానం నుంచి ప్ర‌తిప‌క్ష‌నేత‌పైనా, మండలి స‌భ్యుడినైన నాపైనా నిందారోప‌ణ‌లు చేయడం మీ స్పీక‌ర్ స్థానానికి స‌ముచితం కాదు. అగ్రిగోల్డ్ బాధితుల‌కు టీడీపీ హ‌యాంలో అందించే సాయాన్ని వైకాపా నేత‌లు అడ్డుకోకుండా ఉండి ఉంటే.. ఇప్ప‌టిక‌న్నా ఎక్కువ సాయమే అందేది. మీరు చేసిన ఆరోప‌ణ‌ల‌కు క‌ట్టుబ‌డి ఉంటాను అంటే నాదొక స‌వాల్‌. అగ్రిగోల్డ్‌కి సంబంధించి ఏ ఒక్క అంశంలోనైనా నాకు సంబంధం ఉంద‌ని నిరూపిస్తే నా ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసి రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాను. ఒక‌వేళ మీరు చేసిన ఆరోప‌ణ‌లు అన్నీ అవాస్త‌వాల‌ని తేలితే..మీరేం చేస్తారో కూడా చెప్పాల‌ని ఈ బ‌హిరంగ లేఖ ద్వారా స‌వాల్ విసురుతున్నాను. ఇటువంటి బురద జల్లే ఆలోచనలన్నిటి వెనుకా మీ పార్టీ అధ్యక్షులవారి ప్రోద్భలం, ప్రోత్సాహం ఉంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే. మీ ఆరోపణలకు కూడా అదే కారణమై ఉంటుంది. కాబట్టి మీ ఆరోపణలు అవాస్తవమని తేలితే, మీరన్నట్టే ఒక ప్రజా ప్రతినిధిగా మీ పార్టీ అధ్యక్షుడి గుడ్డలూడదీసి, రాజకీయాల నుండి తప్పించేలా సవాల్ స్వీకరిస్తారని ఆశిస్తూ``అంటూ ముగించేశారు.


సంచ‌ల‌న స‌వాల్ విసిరిన‌ లోకేశ్ లేఖతో స‌రిపెట్ట‌డం...త‌న తండ్రిపై చేసిన కామెంట్ల‌కు కూడా మీడియా ముందుకు రాకుండా కేవ‌లం లేఖ‌తోనే సరిపెట్ట‌డం చూస్తుంటే...టీడీపీని న‌డిపించే యువ‌నేత ఈయ‌నేనా?  ప్ర‌తిప‌క్ష నేత‌ను ఎదుర్కునేందుకు ఎలా మీడియా ముందు విజృంభించాలి...అలాంటి ఎలా మ‌మా అనిపించారు? అంటూ లోకేశ్‌ లేఖ‌ను ప‌లువురు అంటున్నారు. ఇలా, లోకేశ్ ప‌నితీరు చూసే... రాజ‌కీయ నాయ‌కులే కాదు..సినిమాలు తీసుకునే రాంగోపాల్ వ‌ర్మ  సైతం పేరు పెట్ట‌కుండా...ప‌ప్పు అంటూ సెఐట‌ర్లు వేయ‌డం, పార్టీని న‌డిపించ‌డం త‌న‌వల్ల కాద‌నే మాట‌ను పాట రూపంలో వ్య‌క్తీక‌రించారంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: