వారాంతపు సెలవుల్ని ఎంజాయ్ చేద్దామని భార్యాపిల్లలతో సిటీకి వెళ్తే అక్కడ దొరికే తిండి పదార్థాలు దాదాపు కల్తీగానే ఉంటున్న విషయం తెలిసి..  తప్పదన్న బాధతో అవే తింటున్నారు ఎంతో మంది జనం.  ఒకప్పుడు స్వచ్చమైన గాలి, నీరు, వాతావరణం ఉండటం వల్ల మనిషికి ఎలాంటి రోగాలు దరిచేరకుండా ఉండేవి..దాంతో వారి ఆయుశ్షు కూడా వందేళ్లకు పైగా ఉండేది. కానీ ఇప్పుడు మనిషి ఉదయం లేచిన మొదలు..రాత్రి పడుకునే వరకు గాలి, నీరు, వాతావరణం..చివరకు మనం తినే తిండి కూడా కల్తీ..కల్తీ..ఇది జగమరెగిన సత్యం. 


అయితే కల్తీని నిరోదించడానికి ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా..అందులో ఉండే లొసుగులు అడ్డం పెట్టుకొని కల్తీరాయుళ్లు రెచ్చిపోతున్నారు. నిత్యావసర వస్తువులలో అనవసర పదార్ధాలను కలిపి చలామణీ చేయడం నేరం. దీనినే కల్తీ చేయడం (Adulteration) అంటారు. ఈ కల్తీ వలన కొన్నిసార్లు ప్రాణాలకు ప్రమాదం కలుగుతుంది. కానీ, ఈ మద్య కొంత మంది డబ్బే ప్రధానం అనుకొని..ఎవడి ప్రాణాలు పోతే మాకేంటి అన్న చందంగా మారింది.  ప్రతి తినే పదార్థాల్లో కల్తీ చేస్తున్నారు. ఉదయం మనం తాగే పాల నుంచి..మనం తినే ఫాస్ట్ ఫుడ్స్ ల వరకు ఎదో ఒక కల్తీ ఉంటూనే ఉంది.  ముఖ్యంగా జంగ్ ఫుడ్స్ లో నూనె విషయంలో ఎవరూ శ్రద్ద వహించారు..వాడే ఫుడ్ క్వాలిటీ గురించి ఆలోచించరు.


ఇది మనకు తెలిసినా..గత్యంతరం లేక తినే పరిస్థితిలో తింటున్నాం.  అప్పుడప్పుడ సోషల్ మీడియాలో గప్ చూప్ సెంటర్ నిర్వహించే వారు..కలుషితమైన నీటిని రసానికి ఉపయోగిస్తున్నారని..గప్ చూప్ తయారీలో కూడా వ్యర్థపదార్థాలు వాడుతారని చూపిస్తుంటారు.  మరీ దారుణమైన విషయం ఏంటేంటే..పెద్ద పెద్ద హూటల్స్ అని చెప్పుకొని తిరిగేవారు..వారం రోజుల పాటు మాంసం, చికెన్ ఫ్రిజ్ లో ఉంచి వాటినే వేడి చేసి కస్టమర్లకు ఇస్తున్నట్లు ఫుడ్ కంట్రోల్ రైడ్ చేస్తున్నపుడు బయడపడుతున్న నగ్న సత్యాలు.  అందుకే మనం ఎక్కువ శాతం ఇంటి వంటలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులు సలహాలు ఇస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: