తెలుగు రాష్ట్రాల్లో అబ్దుల్లా పూర్‌ మెట్ ఎమ్మార్వో హత్య కలకలం రేపిన సంగతి అందరికి తెలిసిందే. తర్వాత లంచం విషయంలో ప్రభుత్వ అధికారులు కాస్త వెనక్కు తగ్గతారని భావించడం జరిగింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు బాగా పెరిగి పోతుంది అవినీతి. ఇక అధికారులు మాత్రం భాగోతాలు బయట పడుతూనే ఉండడం మనం చూస్తున్నాము. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరిగి పోవడం జరిగింది. పరువుపోతుందంటూ వెక్కి, వెక్కి ఏడవడం మొదలు పెట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా  వైరల్‌ గా మారింది ఇప్పుడు.


ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలంలో సౌజన్య ఆర్.ఐ. గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చోడిశెట్టి బేబీ అనే మహిళ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం మీసేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవడం జరిగింది. తర్వాత ఆర్‌ఐ సౌజన్యను కలిసి తన సర్టిఫికేట్ గురించి పూర్తి వివరాలు ఆరా తీయగా, ఆర్‌ఐ మూడు వేలు లంచం డిమాండ్ చేయడం జరిగింది. ఆ డబ్బు ఇచ్చేందుకు బేబి కూడా సరే అని చెప్పింది. డీల్ ప్రకారం మూడు వేలు తెచ్చిస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారు.


లంచం డిమాండ్ చేస్తున్న విషయాన్ని బేబి ముందుగానే ఏసీబీ అధికారులకు తెలియచేసింది. ఆమె ఆర్ఐ సౌజన్య లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకోవడం జరిగింది. డబ్బును స్వాధీనం చేసుకుని కేసు నమోదు కూడా చేయడం జరిగింది. లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైపోయిన సౌజన్య మీడియా ప్రతినిధుల్ని చూసి వెక్కి, వెక్కి ఏడ్చింది. ఇలా లంచం తీసుకునే వారి మీద ప్రభుత్వ అధికారులు మంచి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. మరి ఈ విషయం పై ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: