ఏపీ ప్రభుత్వానికి సింగపూర్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తాజాగా రాసిన లేఖలో రాజధానిలోని స్టార్ట్ అప్ ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించింది. పరస్పర అంగీకారం మేరకు సింగపూర్ కన్సార్షియమ్- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్టు సింగపూర్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది.


2017లో అప్పట్లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఈ ఒప్పందం కుదిరింది. కానీ 2017లోనే ఒప్పందం కుదిరినా.. 2019 వరకూ అంటే రెండేళ్ల పాటు పెద్దగా అడుగులు ముందుకు పడలేదు. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయిన సంగతి తెలిసిందే. సీఎంగా వైఎస్ జగన్ వచ్చాక అమరావతి విషయం మరింత డైలమాలో పడిపోయింది.


రాజధాని అభివృద్ధి కంటే..తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపైనే సీఎం జగన్ దృష్టి పెట్టారు. అందుకే సింగపూర్ కన్సార్షయమ్ తో కుదుర్చుకున్న ఒప్పందం ముందుకు కదలలేదు. ఏపీలో సీన్ అర్థం చేసుకున్న సింగపూర్ కూడా ఈ ఒప్పందం గురించి పెద్దగా ఉత్సాహంగా లేదు. మొత్తానికి ఈ ఒప్పందాన్ని రెండు ప్రభుత్వాలు పరస్పర అంగీకారం మేరకు రద్దు చేసుకున్నట్టు చెప్పొచ్చు.


సింగపూర్ కన్సార్షియమ్ లోని అసెండస్ సింగ్ బ్రిడ్జ్- సెంబు కార్పె కార్పొరేషన్ ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగినట్టు సింగపూర్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అసలు ఇంతకీ ఈ ఒప్పందం దేని కోసం అంటారా.. అమరావతి లోని కీలకమైన 6.84 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేసే లక్ష్యం తో స్టార్టప్ ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టును చేపట్టారు.


ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాల వల్ల దీన్ని చేపట్టకూడని ఏపీ సర్కారు కూడా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రాజెక్టును నిలిపి వేస్తున్నట్టు సింగపూర్ వాణిజ్య పరిశ్రమల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నిర్ణయంతో అమరావతిపై ఏపీ సర్కారు.. తన విధానంపై మరింత క్లారిటీ ఇచ్చినట్టు భావించొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: