చిన్న కాచిగూడ లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కాచిగూడ రైల్వే స్టేషన్ లో నిలిచి ఉన్న హిద్రి  ఎక్స్ ప్రెస్  రైలును  లింగంపల్లి నుంచి ఫలక్నామ వెళ్తున్న  ఎంఎంటీఎస్ రైలు ఢీ కొట్టింది.కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఆగివున్న పాసింజర్ ట్రైన్ వెనుక నుంచి వస్తున్న ఎంఎంటిఎస్ ఢీ కొట్టడటంతో ఘోర రైలు ప్రమాదం జరిగింది . ఈ ఘటనతో రైలులో ఉన్న  ప్రయాణికులు అందరూ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘోర రైలు ప్రమాదంలో ఎంఎంటీఎస్ డ్రైవర్ చంద్రశేఖర్ ఇంజన్ కాబిన్ లో ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. అయితే లోకో పైలట్ చంద్రశేఖర ప్రాణాలతో బయటకు తీసేందుకు 8 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత రెస్క్యూ  సిబ్బంది అతన్ని బయటకు తీసారు. అనంతరం ప్రాథమిక చికిత్స కోసం నాంపల్లిలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ రైలు ప్రమాద ఘటనలో ఎంఎంటిఎస్ రైలు ఇంజన్  పూర్తిగా దగ్ధం అయినట్లు  తెలుస్తోంది. 

 

 

 

 అయితే ఇంజన్ క్యాబిన్ లో  ఇరుక్కుపోయిన డ్రైవర్ను బయటకు తీసేందుకు తీవ్రంగా కష్టపడిన రెస్క్యూ టీమ్  గ్యాస్ కట్టర్ల సహాయంతో ఇంజన్ భాగాలను తొలగించి ఎట్టకేలకు రైలు డ్రైవర్  చంద్రశేఖర్ ను  సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కాగా ఈ ఘటనలో మరో 12 మంది ప్రయాణికులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. కాగా రైల్వే డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్పష్టం చేశారు అధికారులు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. 

 

 

 ఎంఎంటీఎస్ రైలు ఇంజన్ క్యాబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ చంద్రశేఖర్ కేర్ ఆస్పత్రికి తరలించగా చంద్రశేఖర్ అక్కడ చికిత్స పొందుతున్నారు.అయితే ప్రస్తుతం  చంద్రశేఖర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎంఎంటీఎస్ రైలు పాసింజర్ ఎక్స్ ప్రెస్ ను  బలంగా ఢీకొనడంతో ఇంజన్ క్యాబిన్ లో ఇరుక్కుపోయిన చంద్రశేఖర్ కి పక్కటెముకలు విరగాయని నిర్దారించారు  డాక్టర్లు . అయితే లోకో పైలెట్ కి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని అధికారులను ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: