ఈ రోజు కార్తీక పౌర్ణమి. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లో ప్రజలు ఆనందంగా పౌర్ణమి ఉత్సవాలను  ఉదయం నుండే నిర్వహించడం మొదలు పెట్తారు. ఇందుకు గాను తెలవారకముందే మేల్కోని తలంటు స్నానాలు, చేయడం మొదలు పెట్టారు. వీలున్న వారు నది స్నానాలకు వెళ్లుచున్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు శివాలయాల్లో అర్చనలు, పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.


ఇకపోతే ఇప్పటికే గోదావరి తీరాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ఇక కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అంతేకాకుండా గోదావరి నదిలో కార్తీక దీపాలు వదులుతు తమ భక్తి చాటుకుంటున్నారు.. ఇక అన్ని రాష్ట్రాల్లోని హిందు భక్తులు  తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి శివాలయంలో రుద్రాభిషేకం చేయిస్తున్నారు. ఇలా చేస్తే జన్మజన్మాల పాపాలు తొలగిపోతాయని వీరి నమ్మకం..


ఇంతటి ఆనంద సమయాన విషాదాలు చోటు చేసుకోవడం నిజంగా దురదృష్టకరం. నది స్నానాలకు వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రతి వారు హెచ్చరిస్తూనే ఉంటారు. అయినా కొందరు పిల్లలు వారి మాటలను పెడచెవిన పెట్టి అజాగ్రత్తగా వ్యవహరించడం వల్ల ప్రాణ నష్టాలు జరిగి మరణిస్తున్నారు. ఇప్పుడు ఇలాగే జరిగింది. రాష్ట్రమంతా దీప కాంతులతో వెలిగిపోతుంటే ఓ ఇంటిలోని దీపాలు ఆరిపోయాయి.


పూర్తి వివరాలు తెలుసుకుంటే. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వరికోలులో విషాదం చోటు చేసుకుంది. ఆనందంగా కార్తిక మాసం స్నానాలకని వెళ్లిన ముగ్గురు విద్యార్ధులు మృత్యువాత పడ్డారు. స్నానానికని వాగులోకి దిగిన వీరు అనుకోకుండా అందులోనే మునిగి వారి తల్లిదంద్రులకు తీరని శోకాన్ని మిగిల్చారు. ఇకపోతే మరణించిన మృతులు కంటె నిఖిల్, కూన ప్రశాంత్, పెందోట వరప్రసాద్‌లని పోలీసులు తెలిపారు.. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్దలాన్ని పరీక్షించి కేసునమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: