లక్షల వ్యయంతో ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకొనే ప్రభుత్వాలని ఎప్పుడేనా మా కోసం ఏదేనా చేయండి బాబు అని అడగని వారే.... చెత్తని, చిత్తుకాగితాల్ని ఏరుకొని బ్రతికే ఈ అనాథలు. అలాంటి ఓ అనాథ ఆమె చనిపోతే కనీసం అంత్రక్రియలకు సహాయపడే వారు ఎవరూలేరు, ఒక్క ఆమె భర్త మినహాయించి. అవును ! ఈ పుట్టెడు దుఃఖం లో ఉన్న అనాథ భర్తకు తన భార్య అంత్యక్రియల కోసం ఏ ప్రభుత్వ వ్యవస్థ స్పందించలేదు. 


వివరాల్లోకి వెళ్తే, అతని పేరు నాగరాజు ఆమె పేరు సుజాత. ఒకరిది డోన్ మరొకరిది వరంగల్. వీరిద్దరూ చిత్తుకాగితాలు ఏరుకొని జీవనం సాగిస్తూ ఓ రైల్వే స్టేషన్ లో ఆశ్రమం పొందుతున్నారు. ఒకరోజు వారిరువురు ఒకరికి ఒకరు ఎదురయ్యారు. ఆ తర్వాత ఇద్దరం కలిసి జీవిద్దాం అని వాళ్ళ ఇష్టానుసారం ఒక్కటయ్యారు. ఏడాదిన్నర కాలంగా పగలంతా కష్టపడుతూ, వచ్చిందాంతో భార్యాభర్తలుగా సంతోషంగా జీవిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం పొట్టకూటి కోసం మహానంది పుణ్యక్షేత్రానికి వచ్చారు. అయితే ఊహించని రీతిలో వారి విధి వక్రికరించి సుజాత కి జ్వరం వచ్చింది. తెలిసినవాళ్లంటూ ఎవరూలేని దయనీయమైన పరిస్థితి.. వేల డబ్బులు పెట్టి వైద్యం చేయించలేని వారి పేదరికం ఆమెను మృత్యవొడికి చేర్చాయి. 


ఆమె ఆకస్మిక మరణాన్ని జీర్ణించలేకపోయాడు నాగరాజు. జేబులో రూపాయ బిళ్ళ లేని అతనికి ఏం చేయాలో పాలుపడలేదు. అతని భార్య అంత్యక్రియల కోసం ఆ మహానంది లో కనిపించిన వారినంతా సాయం చేయమని అడిగాడు. కొంతమంది దయమానులు సాయం చేయడంతో రూ. 2000 జమయ్యాయి. కానీ తన భార్య మృతదేహాన్ని స్మశానానికి తరలించడానికి ఓ నలుగురు కూడా రాకపోయేసరికి, నాగరాజే ఆమెను దుప్పట్లో చుట్టి తన భుజాలపై వేసుకొని అంత్యక్రియలు నిమిత్తం బయల్దేరాడు. ఈ నాగరాజు దుస్థితి తెలుసుకున్న దేవస్థానం వాళ్ళు అతనికి ఒక చెత్తబండిని, గొయ్యి తవ్వడానికి ఓ పలుగు, పారా ఇచ్చారు.


దీంతో సుజాత శవాన్ని తోపుడు బండిలో వేసుకొని స్మశానానికి తీసుకెళ్లాడు నాగరాజు. ఈ బండి తోసే క్రమంలో ఓ స్థానిక పేదవాడు నాగరాజుకు సాయం చేసాడు. సుజాత శవాన్ని తానే గొయ్యి తీసి తానే పూడ్చిపెట్టాడు నాగరాజు. ఇది ఓ అనాథ దంపతుల కన్నీరుపెట్టే గాధ. ఓ అనాథ మరణిస్తే కానీసం అంత్రక్రియలకు సాయపడని ప్రభుత్వం ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే.


మరింత సమాచారం తెలుసుకోండి: