టీఎస్ ఆర్టీసి సమ్మె ఇప్పుడప్పుడే కొలిక్కి వచ్చే అవకాశం కనపడడంలేదు. ఇటు ప్రభుత్వం అటు ఆర్టీసి కార్మికులు సమ్మె పై వెనక్కి తగ్గకపోవడంతో సమ్మె కొనసా.... గుతోంది. దీనితో అతి సామాన్య ఆర్టీసి కార్మికులు వారి కుటుంబ సభ్యులు త్రీవ ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


ఇక ఆర్టీసి కార్మికుల జీవినం వర్ణనానీతం. అక్టోబర్ 5 వ తారీఖు నుంచి సమ్మె లో వున్న ఆర్టీసి కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలు కూడా అందలేదు. అక్టోబర్ నెలలో సమ్మె లో వున్న కారణంగా జీతాలు రాలేదు. కావున రెండు నెలలనుంచి జీతాలు అందక ఆర్టీసి కార్మికులు కుటుంబ పోషణ కు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇక ఆర్టీసీ స్ట్రైక్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న.. ఈ కండక్టర్.. కుటుంబ పోషణ కోసం కత్తెర పట్టాల్సి వచ్చింది. ప్రస్తుతం సమ్మె కారణంగా కుటుంబ పోషణ కోసం మహీపాల్ అనే ఈ కండక్టర్ తన కులవృత్తిని చేపట్టాడు. 


నిర్మల్ రూరల్ మండలం రత్నాపూర్ కాండ్లీకి చెందిన మహీపాల్ గతంలో హెయిర్ సెలూన్ నిర్వహించేవాడు. 2009లో ఆర్టీసీలో కండక్టర్‌గా ఉద్యోగం రావడంతో కులవృత్తిని పక్కకు పెట్టి ఆర్టీసీ సిబ్బందిలో ఒక భాగమయ్యాడు. కానీ ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో యూనియన్లు నిరవధిక సమ్మె చేయడంతో  కండక్టర్ ఉద్యోగం లో వున్న మహిపాల్ కు జీతాలు అందని పరిస్థితి.   దీనితో కుటుంబ పోషణ భారమైంది. ఇక మహీపాల్ మళ్లీ కత్తెర పట్టక తప్పలేదు. కత్తెర పట్టి రోజు తమ గ్రామస్థులకు హెయిర్ కటింగ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు మహిపాల్. 


ఈ సందర్భంగా మహిపాల్ మాట్లాడుతూ "నేను సమ్మె కార్యకలాపాలు జరిగినప్పుడు నా సహోద్యోగులతో కలిసిపోతున్నాను మరియు సెలూన్ షాపులో పని చేస్తూ నా కుటుంబ పోషణ కు అవసరమైన డబ్బులు సంపాదిస్తున్న" అని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: