బ్రతికుండగా మనిషికి ఎలాగో విలువ లేదు కనీసం మరణించాకా ఐనా విలువ ఇస్తారనుకుంటే అంతకంటే దారుణంగా సాటి శవం పట్ల వ్యవహరిస్తారు. ఇదంతా అనాధ శవాల పట్ల ప్రభుత్వ హస్పిటల్ వారు కనబరిచే నిర్వాకం. మరణించడం వారి తప్పు కాదు. మరణం ఎవరికైన ఒకటే. కాని అనాధగా మరణించడం మాత్రం ఏదో కర్మఫలం. దాని వల్ల ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మరణించాక గవర్నమెంట్ దవాఖానకు చేరితే అక్కడ ఎలుకలు చనిపోయిన వారి శవాలను పీక్కు తినడం అనేది నిజంగా దారుణం.


ఇకపోతే అనాధ శవాలకు ఉచితంగా అంత్యక్రియలు చేసే ట్రస్టులున్నాయి. కనీసం వారికైన సమాచారం అందించవలసిన బాధ్య‌త ప్రతి పౌరునికి ఉంది. ఇకపోతే వైద్యులుగా సేవలందిస్తున్న వారు కూడా ఈ శవదహన విషయంలో నిర్లక్ష్యం వహించడం నిజంగా బాధాకరం. ఇకపోతే సంగారెడ్ది ప్రభుత్వ హస్పిటల్ వారి నిర్లక్ష్యం వల్ల అనాధ శవాలను ఎలుకలు పీక్కు తింటున్నాయి. నెలలు గడుస్తున్న ఈ అనాధ శవాలకు అంత్యక్రియలు నిర్వహించకుండా మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం ఒకవైపు, పట్టి పట్టనట్లుగా చూస్తున్న హస్పిటల్ వర్గాలు మరో వైపు ఉండటం వల్ల  మార్చూరిలో మగ్గుతున్న ఈ శవాలను ఎలుకలు పీక్కుతినడం అత్యంత బాధాకరం.


ఈ సంఘటన సమాజంలో మానవత్వం అసలే లేదని నిరూపిస్తుంది. ఐన వారు చనిపోతే ఇలానే ప్రవర్తిస్తారా సాటి మనుషులు. ప్రవర్తించరు కదా మరి అనాధ శవాలకు కనీసం తోచిన విధంగా ఐన వారి అంత్యక్రియలకు సహకారమందిస్తే వారి ఆస్తులు కరిగిపోవుకదా. పొద్దున లేచినప్పటి నుండి నీతులు చెప్పేవారుంటారు కాని ఆచరాణలోకి వచ్చేసరికి దూరంగా వెళ్లిపోతారు. మనిషిలో మనసు మాయమవుతుందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది. ఈ విషయంలో ఇప్పటికైన హస్పిటల్ సిబ్బంది కాని మున్సిపల్ సిబ్బంది గాని త్వరగా స్పందించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటే బాగుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: