ఇసుక కొరతపై చంద్రబాబు తలపెట్టిన దీక్షకు మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు ఆ పార్టీ నేతలు. ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు కన్నాని కలిసిన టీడీపీ నేతలు.... పవన్‌ మద్దుతు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. అలాగే అన్ని వర్గాలకు బహిరంగ లేఖ రాశారు చంద్రబాబు. 


ఇసుక కొరతపై చంద్రబాబు దీక్షకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. విజయవాడలో ఈ నెల 14న 12 గంటల పాటు దీక్ష చేయనున్నారు చంద్రబాబు. ధర్నాచౌక్‌లో నిర్వహించే ఈ దీక్షకు సర్వం సిద్దం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు, నేతలు ఈ దీక్షలో పాల్గోనేలా ప్రణాళికలు సిద్దం చేస్తుంది టీడీపీ అధినాయకత్వం. 


మరోవైపు ఈ దీక్ష కోసం ఇతర రాజకీయ పార్టీల మద్దుతు కోసం ప్రయత్నాలను టీడీపీ ముమ్మరం చేసింది. టీడీపీ సీనియర్‌ నేత ఆలపాటి రాజా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారయణను కలిసి దీక్షకు మద్దుతు ఇవ్వాలని కోరారు. ఇసుక సమస్యపై ఎవరు దీక్ష చేసినా సంఘీభావం ఉంటుదని ప్రకటించింది బీజేపీ. ఐతే స్వయంగా టీడీపీ దీక్షలో మాత్రం బీజేపీ నేతలు పాల్గొనే ఛాన్స్‌ లేదనీ, పార్టీ ఒంటరిగానే పోరాటాలు చేసిందని ప్రకటించారు కన్నా.


బీజేపీతో సంప్రదింపుల అనంతరం టీడీపీ నేతలు జనసేనతో చర్చలు జరిపారు. నాదెండ్ల మనోహర్‌తో టీడీపీ నేతలు ఫోన్‌లో మాట్లాడారు. దీక్షకు మద్దుతు ఇవ్వాలని కోరారు. పవన్‌తోనూ టీడీపీ నేతలు భేటీ కానున్నారు. పవన్‌ విశాఖ లాంగ్‌ మార్చ్‌కు చంద్రబాబు టీడీపీ  నేతలను పంపారు. దీంతో ఇప్పుడు తమ దీక్షకు మద్దుతుగా ఉండాలని పవన్‌ను కోరనున్నారు టీడీపీ తమ్ముళ్లు.


మరోవైపు ఈ దీక్షకు ప్రజలు తరలిరావాలని చంద్రబాబు కోరారు. ఇసుక కొరతతో నష్ట పోయిన కార్మికులు, వ్యాపారాలు కోల్పొయిన యజమానులు  దీక్షలో భాగస్వాములు కావాలిని చంద్రబాబు లేఖ ద్వారా కోరారు. అధికారం కోల్పోయిన తర్వాత టీడీపీ బాస్‌ చేస్తున్న మొదటి నిరసన కార్యక్రమం కావడంతో ఈ దీక్షను విజయవంతం చేసేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: