వచ్చే ఉగాది నాటికి పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం మనకు ఒక  మానస పుత్రిక లాంటిది అని, ఈ పథకాన్ని విజయవంతం చేయడానికి అధికారులు అందరు కూడా  కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలియచేయడం జరిగింది. దేశమంతా ఈ కార్యక్రమంపై మాట్లాడుకుంటోదని, దీన్ని బట్టే మన పాలన ఎలా ఉందో అర్థమవుతోందని అని  స్పష్టంగా తెలియ చేశాడు.


 వైఎస్సార్‌ రైతు భరోసా పథకం సీఎం  సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. తాడేపల్లిలో సీఎం కార్యాలయంలో మంగళవారం చేపట్టిన సమీక్ష సమావేశంలో అధికారులకు సీఎం జగన్‌ పలు కీలక సూచనలను కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలోనూ పథకాలపై సోషల్‌ ఆడిట్‌ కచ్చితంగా చేయాలనీ తెలిపాడు. సమీక్ష సందర్భంగా సీఎం అధికారులతో చర్చిస్తూ.. ‘ప్రతి గ్రామంలోనూ సోషల్‌ ఆడిట్‌ చేయాలి. ఇంకా ఎక్కడైనా పొరపాట్లు కారణంగా ఎవరైనా మిగిలిపోతే వారి విజ్ఞప్తులనూ పరిగణలోకి చేర్చుకోండి అని తెలిపాడు.


ఇక వచ్చే రైతు భరోసాలో వారికి మళ్లీ లబ్ది కలిగే అవకాశం కచ్చితంగా  ఉంటుంది అని. ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం మనకు మానస పుత్రిక లాంటిది. కలెక్టర్లు ఈ కార్యక్రమాన్ని విజయవంత చేయడానికి కృషి చేయండి అని పేర్కొన్నాడు. 


నవంబర్‌ 20 నుంచి బియ్యంకార్డు, పెన్షన్, ఆరోగ్యశ్రీ, ఫీజు రియింబర్స్‌ మెంట్‌ లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది అని తెలిపాడు. నవంబర్‌ 20 నుంచి డిసెంబర్‌ 20వ వరకూ ఎంపిక గడువు. దీనికి సంబంధించి కొత్త కార్డుల జారీ గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా ఎంపిక జరుగుతుంది అని తెలిపాడు. అలాగే  వైఎస్సార్‌ రైతు పథకానికి నవంబర్‌ 15న రైతులకు సంబంధించిన కౌలు కూడా ముగిసింది అని తెలియచేయడం జరిగింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: