ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలనలో తన ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారు. మరెన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ పొరుగు రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఇప్పటికే రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం ఎన్నో వినూత్న పథకాలను ప్రవేశపెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఇక తాజాగా  మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా మహిళలకు శుభవార్త చెప్పారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. 

 

 

 

 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో  జిల్లాస్థాయిలో 50 శాతం ఉద్యోగాలు మహిళలకు ఇస్తామంటూ జగన్ ప్రభుత్వం ప్రకటించింది. అమరావతిలో ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ వెబ్సైట్ ను  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ అవుట్ సోర్సింగ్  కార్పొరేషన్ ప్రారంభిస్తున్నామని తెలిపిన సీఎం జగన్... పొరుగు సేవల దాని పరిధిలోకి తీసుకువస్తాం  అంటూ స్పష్టం చేశారు. పొరుగు సేవల ఉద్యోగాల్లో  ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలకు చెందిన వారు 50% ఉండాలని అందులోనూ జిల్లా స్థాయిలో 50 శాతం ఉద్యోగాలు మహిళల కేటాయిస్తామని జగన్ స్పష్టం చేశారు. 

 

 

 

 డిసెంబర్ 15 కల్లా ఆయా శాఖలకు సంబంధించిన ఉద్యోగుల జాబితా అందించాలని జగన్ అధికారులను ఆదేశించారు. ఇక జనవరి 1 నుంచి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల ప్లేస్మెంట్స్ ఆర్డర్ ఇవ్వాలని  అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.ఔట్  సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలతో పాటు ఇతర విషయాలు లాంటి  అంశాల్లో మోసాలకు తావు  లేకుండా  అందరికీ మేలు  జరిగిందుకే  అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: