ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయాలకు మరో పేరు అని అందరికి తెలుసు. అధికారంలోకి వచ్చిన సమయం నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ మరో సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటంటే.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో జిల్లాస్థాయిలో 50శాతం ఉద్యోగాలు మహిళలకే ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. 

              

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు ఏపీ ఔట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ను ప్రారంభించారు. ఏపీ ఆప్‌కాస్‌ వెబ్‌సైట్‌ను కూడా లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వైఎస్ జగన్ 50శాతం ఉద్యోగాలు మహిళలకు ఇవ్వాలనే నిర్ణయాన్ని ప్రకటించారు. వచ్చే సంవత్సరం జనవరి 1 నుంచి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలకు ప్లేస్‌మెంట్‌ ఆర్డర్‌ ఇవ్వనున్నట్టు సీఎం జగన్ తెలిపారు. 

                

ఆంధ్రప్రదేశ్ ఔట్‌సోర్సింగ్‌ కార్పోరేషన్‌ను ప్రారంభిస్తున్నామని, పొరుగు సేవల ఉద్యోగాలన్నింటినీ దీని పరిధిలోకి తీసుకొస్తున్నామని, జీతం ఇచ్చేటప్పుడు ఉద్యోగులను మోసం చేయకుండా, మధ్యవర్తులను పూర్తిగా తొలగించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం జగన్ వివరించారు. పొరుగు సేవల ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన వారు 50 శాతం మంది ఉండాలని, 

             

అంతేకాకుండా జిల్లా స్థాయిలో 50 శాతం ఉద్యోగాలు మహిళలకే ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయా శాఖాధిపతుల కమిటీ నుంచి డిసెంబర్‌ 15 కల్లా ఉద్యోగాల జాబితా రావాలని, జనవరి 1 నుంచి నియామక ఉత్తర్వులు ఇవ్వాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. సీఎం జగన్ నిర్ణయంపై ఏపీ మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: