మహారాష్ట్రలో ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీకి కూడా పూర్తి సంఖ్యలో బలం లేదు అయితే ఎక్కువ అయితే ఎక్కువ స్థానాలు గెలుచుకున్న పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించేందుకు వీలుగా గవర్నర్ భగత్ సింగ్ సింగ్ కోశ్యారి . రెండు రోజుల క్రితమే బిజెపిని ఆహ్వానించారు.


ఎన్నికల ముందు బిజెపి శివసేన కలిసి పోటీ చేశాయి అయితే సీఎం పదవి విషయంలో 50%   50% ప్రతిపాదనలు తీసుకువచ్చింది .అయితే ఈ ప్రతిపాదనలపై బిజెపి నాయకత్వం సానుకూలంగా స్పందించలేదు దీంతో శివసేన కూడా తన పట్టు వీడలేదు దీంతో గవర్నర్ ఆహ్వానం మేరకు బీజేపీ నేతలు గవర్నర్తో సమావేశమైన ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని చెప్పారు..


దీంతో బిజెపి తర్వాత ఎక్కువ సీట్లను కైవసం చేసుకున్న పార్టీగా ఉన్న శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఆహ్వానించారు శివసేన కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకు రాలేకపోయింది దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఎన్సీపీకి గవర్నర్ సోమవారం నాడు రాత్రి ఆహ్వానించారు. మంగళవారం నాడు రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయమై ఎన్సీపీ నిర్ణయం చెప్పాలని గవర్నర్ కోరారు.


ఈపరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ నేతలతో ఎన్సీపీ సంప్రదింపులు జరుపుతోంది కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు మంగళవారం నాడు మధ్యాహ్నం ముంబైకి చేరుకుంటారు ఈ తరుణంలో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ రాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ కేంద్ర ప్రభుత్వానికి మంగళవారం నాడు సిఫారసు చేశారు.


ప్రధానమంత్రి మోడీ మంగళవారం నాడు మధ్యాహ్నం అత్యవసరంగా కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మహారాష్ట్ర లో రాష్ట్రపతి పాలన విషయమై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది .ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు తమకు రెండు రోజుల పాటు సమయం ఇవ్వాలని కోరింది కానీ గవర్నరు ఇవ్వలేదు దీంతో శివసేన ప్రభుత్వ ఏర్పాటు విషయంలో వెనక్కి తగ్గింది 


మరింత సమాచారం తెలుసుకోండి: