పన్ను చెల్లింపుదారులకు సులభంగా ఉండేందుకు పాన్ కార్డు కి బదులుగా ఆధార్ కార్డు కూడా ఉపయోగించే సదుపాయం కేంద్ర ప్రభుత్వం కల్పించిన సంగతి మనందరికీ తెలిసిందే. అంటే మన ఆధార్ కార్డు అక్కడ ఉండకపోయినా 12 అంకెల బయోమెట్రిక్ ఐడి నెంబర్ తో మనం సదరు ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. కానీ తస్మాత్ జాగ్రత్త ఈ విషయంలో మీరు కొంచెం ఆదమరిచి వ్యవహరించినా 10,000 రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

ఆదాయపు పన్ను చట్టం 1961 లో చేసిన సవరణల ప్రకారం కేవలం పాన్ కార్డు వివరాలు మాత్రమే కాకుండా ఆధార్ కార్డు వివరాలు కూడా మనం తప్పుగా ఇచ్చినట్లయితే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఫైనాన్స్ బిల్లు 2019 లో ఇది ఆమోదించబడింది. దీని ప్రకారంగా నియమం ఏమిటంటే ఆదాయ పన్ను డిపార్ట్మెంట్ కొన్ని ట్రాన్సాక్షన్ లకు అనగా 50 వేల రూపాయలకు మించిన లావాదేవీలకు పాన్ కార్డు ఖచ్చితం అని చెప్పగా కొద్దిరోజుల ముందే పాన్ కార్డు బదులు దానితో అనుసంధానం చేయబడిన ఆధార్ కార్డు ఇచ్చినా సరిపోతుంది అని చెప్పింది. 

అయితే మనం ఈ ఆధార్ కార్డు వివరాలు సదరు లావాదేవీలకు ఇస్తున్నప్పుడు క్రింది తప్పులు చేస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
1) పాన్ కార్డు బదులుగా ఇస్తున్న ఆధార్ కార్డు యొక్క నెంబర్ తప్పుగా ఇచ్చినా
2) నిర్దేశించబడిన లావాదేవీలలో పాన్ కార్డు ఆధార్ కార్డు ఈ రెండిట్లో ఏదైనా ఒకదాని వివరాలు అందించే లేకపోయినా
3) ఆధార్ నెంబర్ సరిగ్గా ఇచ్చినా దాంతో అనుసంధానం చేయబడిన చేతి వేలి ముద్రలు మ్యాచ్ కాకపోయినా

అయితే ఆధార్ కార్డును ఇచ్చేది ప్రత్యేక గుర్తింపు అధికారం కలిగిన డిపార్ట్మెంట్ అయినా కూడా జరిమానా వేసింది మాత్రం uidai కాదు. ఆదాయ పన్ను డిపార్ట్మెంట్ విధిస్తుంది. కావున ఇకపై ఆధార్ కార్డు వివరాలు ఇచ్చేటప్పుడు కొంచెం ఏమరుపాటు వహించడం మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: