మహారాష్ట్ర లో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ  చేసిన సిపార్సుకు  కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.దీంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అనివార్యం అయింది.  ఎన్నికల ఫలితాలు  వెలువడినుండి  మహారాష్ట్ర రాజకీయాల్లో  నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. శివసేన బీజేపీ కూటమి అధికారాన్ని ఏర్పాటు అనుకుంటున్నా తరుణంలో ... శివసేన పార్టీకి చెందిన నాయకుడికి రెండున్నరేళ్ల  పాటు సీఎం పదవి కట్టబెట్టాలని కోరడంతో బీజేపీ శివసేన కూటమి కాస్త విబేదించింది. దీంతో  మహారాష్ట్ర లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. శివసేన పార్టీ మాత్రం  తమ పార్టీ నాయకునీకె  సీఎం పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ఎన్సీపీ  కాంగ్రెస్ తో చర్చలు కూడా జరిగాయి. అయితే ఇప్పటికే గవర్నర్  భగత్ సింగ్ కోషిరియా శివసేనను  ప్రభుత్వం ఏర్పాటు ఆహ్వానించగా  బిజెపి తాము  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని చేతులెత్తేసింది.  ఆ తర్వాత శివసేనకు ప్రభుత్వ ఏర్పాటుకు 24 గంటలు కేటాయిస్తే...  మరో 48 గంటల సమయం కావాలని గవర్నర్ ని  కోరారు శివసేన నేతలు . 

 

 

 

 అయితే దీనికి నిరాకరించిన గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ  మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి సిఫార్సు చేయగా కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ క్రమంలో శివసేన పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం మరో రెండు రోజుల  సమయం కావాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేసినప్పటికీ తక్కువ సమయం ఇచ్చారని పిటిషన్ దాఖలు చేసింది శివసేన పార్టీ. బిజెపి పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 48 గంటల సమయాన్ని గవర్నర్ ఇచ్చారని తమకు మాత్రం 24 గంటల సమయం మాత్రమే ఇచ్చారని తెలిపింది. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ  బిజెపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన పిటిషన్ లో  ఆరోపించారు. 

 

 

 

 మరోవైపు శివసేన పార్టీ తరఫున కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ సుప్రీంకోర్టులో వాదించనున్నట్లు సమాచారం. అయితే ఎన్నికల ఫలితాలు వెల్లడి అయినప్పటి నుంచి నేటి వరకు ఎన్నో మలుపులు తిరిగిన మహారాష్ట్ర రాజకీయాలు చివరికి రాష్ట్రపతి పాలన కు దారితీసాయి. మహారాష్ట్ర రాష్ట్రపతి పాలన విధించడం సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: