తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలో నే తన క్యాబినెట్ లో మార్పులు చేయబోతున్నార‌న్న వార్త లీక్ కావ‌డంతో తెలంగాణ రాజ‌కీయాల‌ను మ‌ళ్లీ హీటెక్కిస్తోంది. ఓ వైపు అటు కేబినెట్లో మార్పులు జ‌రిగి మూడు నెల‌లు కూడా కాలేదు అప్పుడే మ‌ళ్లీ మార్పులు అన్న వార్త‌లు మంత్రుల‌కు కంటిమీద కునుకు లేకుండా చేసేస్తున్నాయి. రాష్ట్ర మంత్రి వ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ అంటూ వ‌స్తోన్న వార్త‌ల్లో ఈ సారి ఖ‌చ్చితంగా ఇద్ద‌రు మంత్రుల‌పై వేటు ప‌డుతోంద‌ని అంటున్నారు.


ఈ ఇద్ద‌రు మంత్రుల లీకులు బ‌య‌ట‌కు రావ‌డంతో ఇప్పుడు డౌట్‌గా ఉన్న మంత్రుల‌కు ఎక్క‌డా లేని టెన్ష‌న్ ప‌ట్టుకుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కేబినెట్ లో నలుగురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లాలో ఈటెల రాజేందర్ కు చెక్ పెట్టేందుకే గంగుల కమలాకర్ ను మంత్రివర్గం లోకి తీసుకున్నారు అన్న ప్రచారం కూడా న‌డిచింది. కేబినెట్ విస్త‌ర‌ణ జ‌రిగిన ప్పుడు కేసీఆర్ కేబినెట్ నుంచి తొల‌గించ‌లేదు.


ఇక ఇప్పుడు మాత్రం ఎవ‌రు అవుట్ అవుతారో ? అన్న‌ది స‌స్పెన్స్‌గానే ఉంది. ఇక రాజ‌కీయ వ‌ర్గాల చ‌ర్చ‌ల ప్ర‌కారం ఈట‌ల రాజేంద‌ర్ పేరుతో పాటు ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా నుంచి మ‌ల్లారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మ‌ల్లారెడ్డిపై ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్కువుగా ఫిర్యాదులు చేయ‌డంతో ఈ సారి ఆయ‌న‌కు ఉద్వాస‌న ఉందంటున్నారు. ఇక నిజామాబాద్ నల్గొండ జిల్లాల నుండి కొత్తవారికి ఛాన్స్ ఉన్నట్టు పార్టీ వర్గాల టాక్‌.


హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక ఇన్‌చార్జ్‌గా ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి స‌క్సెస్ కావ‌డంతో ఆయ‌న‌కు ప్ర‌మోష‌న్ అంటున్నారు. అదే జ‌రిగితే జ‌గ‌దీశ్ రెడ్డి ప‌ద‌వి డౌట్‌లో ప‌డుతుంది. ఇక నిజామాబాద్‌లో మంత్రి క‌విత కంప్లెంట్ల నేప‌థ్యంలో మార్పులు ఉండొచ్చంటున్నారు. ఏదేమైనా కేసీఆర్ మ‌రో ప‌ది ప‌దిహేను రోజుల్లోనే కేబినెట్‌లో మార్పులు, చేర్పులు చేస్తారంటున్నారు. మ‌రి ఈ సారి కేసీఆర్ మార్క్ షాకులు ఎవ‌రికి ఉంటాయో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: