జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైసీపీ అధినేత జగన్ పై మండిపడ్డారు. ఇంగ్లీష్ మీడియం విషయంలో తనపై జగన్ చేసిన కామెంట్లపై పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. పవన్ కల్యాణ్ కు మగ్గురు భార్యలు.. నలుగురో ఐదుగురో పిల్లలు.. వాళ్లు ఏ మీడియంలో చదువుతున్నారు.. అంటూ జగన్ నిన్న కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.


ఈ కామెంట్లపై పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. మేం విధానాలపై మాట్లాడుతుంటే.. జగన్ రెడ్డి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారని పవన్ మండిపడ్డారు. మీరు ఎంతగా టార్గెట్ చేసిన మేం మాత్రం విధానాలపైనే మాట్లాడతామన్నారు. ఇదే సమయంలో పవన్ కాస్త ఆగ్రహంగా స్పందించారు. మాట్లాడితే మూడు పెళ్లిళ్లు అంటారు.. మీరు చేసుకోండి ఎవరు వద్దన్నారు అంటూ రియాక్టయ్యారు.


నేనేమీ సరదా కోసం మూడు పెళ్లిళ్లు చేసుకోలేదు.. నాకు కుదరలేదు.. మీకేంటి ఇబ్బంది అంటూ ఎదురు ప్రశ్నించారు. మాట్లాడితే మూడు పెళ్లిళ్లు అంటారు... అవసరమైతే మీరూ చేసుకోండి.. నేనేమి సరదా కోసం చేరుకోలేదు.. అంటూ స్పందించారు. 150 మంది ఎమ్మెల్యేలు జగన్ ని చూసి రెచ్చిపోతున్నారని పవన్ కల్యాణ్ అన్నారు.


వైసీపీ ఎమ్మెల్యేలు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని.. ఎలా మాట్లాడినా పడడానికి మేము టీడీపీ ఎమ్మెల్యేలం కాదని అన్నారు. పద్దతిగా మాట్లాడితే మంచిది.. లేకపోతే మీ భాషలోనే మీకు సమాధానం చెప్పాల్సి వస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు. తాము ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులు తెలుసుకుని వాటిపై పోరాటం చేస్తున్నామని.. ఇదే అంశం పై గవర్నర్ కి కూడా ఫిర్యాదు చేశామని పవన్ గుర్తు చేశారు.


కార్మికులకు మద్దతుగా విశాఖలో భారీ పాదయాత్ర చేశాం.. ప్రజల సమస్యల పట్ల పోరాడుతూనే ఉంటాం.. ఇసుక విధానంలో కొన్ని మార్పులతో గవర్నర్ కి నివేదిక ఇచ్చాం.. ఈ నెల 15, 16 తేదీల్లో డొక్కా సీతమ్మ స్పూర్తితో భవన నిర్మాణ కార్మికులకు భోజనం అందిస్తాం.. అని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం కాదు.. ప్రజల కోసం అంటూ పవన్ కల్యాణ్ మాట్లాడారు.


మరింత సమాచారం తెలుసుకోండి: