ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఇప్పుడు కొత్త సమస్యలతో అల్లాడుతున్నారు. రాష్ట్రంలో ఎవరికి కనీసం గుప్పెడంత కూడా ఇసుక  దొరకని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది. రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత సమస్య తో అభివృద్ధి కోసం చేపట్టిన నిర్మాణాల ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.దీంతో  రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయింది. అటు భవన నిర్మాణ రంగ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇసుక కొరత  సమస్య ఏర్పడడంతో భవన నిర్మాణ రంగ కార్మికులకు కనీస ఉపాధి కూడా కరువైంది. కనీస ఉపాధి లేక తినడానికి తిండి కూడా లేని పరిస్థితి నెలకొంది. దీంతో కుటుంబ పోషణ భారమై మనస్తాపం చెంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతుంటారు. 

 

 

 

ఇసుక కొరతపై  ప్రతిపక్షాలు కూడా వైసీపీ ప్రభుత్వం పై విరుచుకు పడుతున్నారు. అధికార వైసీపీ ప్రభుత్వం తీరు వల్లే రాష్ట్రంలో ఇసుక  కొరత ఏర్పడినది అంటూ  దుమ్మెత్తి పోస్తున్నాయి. జగన్ సర్కార్ కు తెచ్చిన నూతన ఇసుక  పాలసీ వల్లే రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని... కొత్త ఇసుక  విధానాన్ని తొలగించాలని  డిమాండ్ చేస్తున్న  ప్రతిపక్షాలు... ఇసుక కొరతతో నిర్మాణ కార్మికులు గత ఐదు నెలల నుంచి ఉపాధి కోల్పోయారని కార్మికులకు ప్రతి నెల 10 వేల రూపాయల చొప్పున 50వేలు చెల్లించాలని... ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికులు అందరికీ ఎక్స్ గ్రేషియా  ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనికోసం నిరసన కార్యక్రమాలు కూడా జరుపుతున్నాయి.  ఇప్పటికే టీడీపీ నేత నారా లోకేష్ ఒకరోజు దీక్ష చేపట్టగా...  పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్  నిర్వహించారు . 

 

 

 

 అయితే తాజాగా మీడియాతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇసుక సమస్య పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఏర్పడిన ఇసుక కొరత  కారణంగా వేలాది మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కరువైందని పవన్ కళ్యాణ్ అన్నారు . ఇసుక కోరతతో  పని దొరకక కొందరు నిర్మాణ రంగ కార్మిక మనస్థాపం చెంది ఆత్మహత్య కూడా చేసుకున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని... వైసీపీ నేతలు ఎంత హీనంగా మాట్లాడిన...  జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇసుక పాలసీ పై ప్రభుత్వం ప్రశ్నిస్తాం అని  పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అవగాహన లేకుండా పాలన చేస్తుందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. లక్షన్నర మంది తో తాను లాంగ్ మార్చ్ నిర్వహిస్తే కానీ ప్రభుత్వం ఐదు మందికి ఎక్స్ గ్రేషియా  ఇవ్వలేకపోయారు అని పవన్ కళ్యాణ్  ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: