ఏపీలో వైసీపీ, జనసేన అధినేతల మాటల యుద్ధం ముదురుతోంది. ఇంగ్లీష్ మీడియం విషయంలో తనపై జగన్ చేసిన కామెంట్లపై పవన్ కల్యాణ్ రివెంజ్ అన్నట్టుగా కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్ కు మగ్గురు భార్యలు.. నలుగురో ఐదుగురో పిల్లలు.. వాళ్లు ఏ మీడియంలో చదువుతున్నారు.. అంటూ జగన్ నిన్న కామెంట్ చేశారు. ఈ కామెంట్లపై పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు.


మాట్లాడితే మూడు పెళ్లిళ్లు అంటారు.. మీరు చేసుకోండి ఎవరు వద్దన్నారు.. నేనేమీ సరదా కోసం మూడు పెళ్లిళ్లు చేసుకోలేదు.. నాకు కుదరలేదు.. మీకేంటి ఇబ్బంది అంటూ ఎదురు ప్రశ్నించారు. మాట్లాడితే మూడు పెళ్లిళ్లు అంటారు... అవసరమైతే మీరూ చేసుకోండి.. నేనేమి సరదా కోసం చేరుకోలేదు.. అంటూ స్పందించారు. అక్కడితో ఆగకుండా.. తాను చేసుకున్న పెళ్లిళ్ల వల్లే జగన్ రెండేళ్ల జైలుకు వెళ్లారా? అని జగన్‌ను ఉద్దేశించి పవన్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు.


జనసేన అంటే భయపడే వ్యక్తిగత విషయాల జోలికి వస్తున్నారన్నారని పవన్ కల్యాణ్ అన్నారు. ఇంగ్లీష్ మీడియం విషయంలో స్పందిస్తూ... తొలుత పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేయండని సూచించారు. తెలుగు భాషే తమకు సంస్కారాన్ని నేర్పిందని పవన్‌ అన్నారు. ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వకుండా ప్రభుత్వ పాఠశాల్లో ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టడంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రపై సీఎం జగన్‌కు అవగాహన ఉందా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో భాషా ప్రయుక్త రాష్ట్రం ప్రాతిపదికన ఏపీ ఏర్పడిన విషయాన్ని గుర్తుంచుకోవాలని పవన్ కల్యాణ్ అన్నారు.


ఉపాధ్యాయులకు ఆంగ్లంలో శిక్షణ ఇవ్వకుండా పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ప్రవేశపెడితే ఎలా అని పవన్‌ ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారవుతుందని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లపాటు ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన అవసరం రాదనుకున్నానని.. ప్రభుత్వ వైఖరితో నాలుగు నెలలకే తాము రోడ్డెక్కాల్సి వచ్చిందని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: