సోమవారం జరిగిన మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవ వేడుకల్లో జగన్ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టినందుకు విమర్శిస్తున్న వారిని కొన్ని ప్రశ్నలు అడిగారు. 'చంద్రబాబు కొడుకు, మనవడు ఎక్కడ చదువుతున్నారు.... వెంకయ్య నాయుడు కొడుకు మనవడు ఇంగ్లీష్ మీడియంలో చదవలేదా..? అంతెందుకు.. ముగ్గురు పెళ్ళాలు , నలుగురు ఐదుగురు పిల్లలున్న పవన్ కళ్యాణ్ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారు? అంటూ సీఎం ప్రశ్నించారు. 


దీనిపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..."ప్రభుత్వం ఇసుక కొరత సమస్యను పక్కదారి పట్టించేందుకే నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తుంది. ఏపీ సీఎం జగన్ నా మీద చేసిన వ్యక్తిగత ఆరోపణలకు నేను స్పందించను. మేము కేవలం సమస్యపై మాత్రమే మాట్లాడతాం. రాష్ట్ర ప్రభుత్వం అవగాహన లేకుండా పరిపాలన చేస్తోంది."


పవన్ కళ్యాణ్ ఇంకా మాట్లాడుతూ ఇలా అన్నారు...'కేవలం విధి విధానాలపై మాత్రమే మాట్లాడాలి. ఒక్క ఎమ్మెల్యే ఉన్న మా పార్టీ ఓ సమస్యపై మాట్లాడాల్సి వస్తోందంటే... పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. నా గురించి మాట్లాడితే మూడు పెళ్లిళ్లు అంటున్నారు... కావాలంటే మీరు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోండి. నా మూడు పెళ్లిళ్ల కారణంగా ఆయన జైలుకు వెళ్లలేదు. ఫ్యాక్షనిజానికి..జగన్ వద్ద ఉన్న అధికారం..డబ్బుకు నేను భయపడను.

మేం ఇలాగే మాట్లాడుతాం..విజయవాడలో గొడవపడదాం అంటే నేను సిద్ధం. ఇంగ్లీషు మీడియం అమలుకు ముందు పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసి నిర్ణయం తీసుకోవాలి. మమల్ని తిడితే భరించటానికి మేము టీడీపీ కాదు..జనసేన బలం తక్కువగా అంచనా వేయ్యొద్దు. సీఎం జగన్‌ను చూసుకుని 151 ఎమ్మెల్యేలు ఎగిరెగిరి పడుతున్నారు... ఆయన పరిస్థితిలో తేడా వస్తే మీ పరిస్థితి ఏంటో తెలుసుకోండి," అంటూ హెచ్చరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: