తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ఆర్టీసీ సమ్మె పై కీలక నిర్ణయం తీసుకునేందుకు హైకోర్టు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె మొదలై ముప్పై తొమ్మిది రోజులకు చేరుకున్నప్పటికీ  అటు ప్రభుత్వం ఇటు కార్మికులు గాని చర్చలు జరిపేందుకు ముందుకు రాకపోవడంతో ఇన్ని రోజుల వరకు ఓపిక పట్టిన హైకోర్టు ఆర్టీసీ సమ్మె పై కమిటీ వేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే సోమవారం వాయిదా పడిన ఆర్టీసీ సమ్మె  పై  విచారణను నేడు చేపట్టిన హైకోర్టు... ఈ సందర్భంగా ఆర్టీసీ సమ్మె పై సుప్రీంకోర్టు ముగ్గురు మాజీ చర్చలతో కమిటీ వేస్తామని, రేపటిలోగా ప్రభుత్వాన్ని అడిగిన నిర్ణయం తెలపాలని అడిషనల్ జనరల్ ను ఆదేశించింది హైకోర్టు.కాగా  ఆర్టీసీ సమ్మె పై విచారణను రేపటికి వాయిదా వేసింది. 

 

 

 

 అంతకు ముందుగా ఆర్టీసీ సమ్మెతో చర్చలు లేవన్న రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా  ప్రకటించే ఆలోచనలో ఉండడంతో... ఎస్మా  ప్రకటించేందుకు వీలు లేదని హైకోర్టు స్పష్టం చేసింది . ఆర్టీసీ సేవలు కేవలం ప్రజల  వినియోగ సేవలు మాత్రమే అని అత్యవసర సేవలు కిందకు రాదని తెలిపిన  హైకోర్టు...ఎస్మా  ఉపయోగించాలంటే ఆర్టీసీ ఎస్మా   కిందికి వచ్చేలా ప్రత్యేక  జీవో జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. అయితే దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాది మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మె ఎస్మా పరిధిలోకి వస్తుందని 1998,  2015 లో ఆర్టీసీ పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం జీవోలు జారీ చేసిందని తెలిపారు. 

 

 

 

 గతంలో ఇచ్చిన జీవో ఇప్పుడు వర్తిస్తాయ అంటూ  హైకోర్టు అడిషనల్ జనరల్ ని  ప్రశ్నించింది. 1998లో జారీచేసిన జీవో కేవలం ఏపీఎస్ఆర్టీసీ కి వర్తిస్తుందని  స్పష్టం చేసిన హైకోర్టు... 2015లో ఇచ్చిన జీవో  ఆరునెలలకు మాత్రమే పరిమితం అని తేల్చి చెప్పేసింది. కాగా  రేపు 2.30 నిమిషాలకు ఆర్టీసీ సమ్మె హైకోర్టులో విచారణ జరిగనుంది . ఇదిలా ఉండగా ఆర్టీసీ కార్మికులు మాత్రం తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి సమ్మెను రోజురోజుక ఉదృతం  చేస్తున్నారు ఇప్పటికే చేపట్టిన చలో ట్యాంక్ బండ్ కార్యక్రమం రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఇకమీదట చేపట్టబోయే నిరసన కార్యక్రమాలు కూడా ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తాయి అన్నట్టుగా ఉంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: