అనుకున్నట్టే అయ్యింది. ఊహించినట్టుగానే వారం రోజులుగా అనేక మలుపులు తిరిగిన మాహారాష్ట్ర రాజకీయాలు రాష్ట్రపతిపాలనతో క్లైమాక్స్ కు చేరుకున్నాయి. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలన్న కేంద్రం నిర్ణయానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కు అన్ని పార్టీలు విఫలం అయ్యాయని గవర్నర్ కేంద్రానికి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.


ష్ట్రపతిపాలన విధించాలని కేంద్రానికి గవర్నర్ సిఫారసు చేశారు. గవర్నర్ నివేదిక ఆధారంగా కేంద్రం మంత్రి మండలి అత్యవసరంగా సమావేశమై రాష్ట్రపతి పాలన విధించాలని నిర్ణయించింది. అయితే.. ఈ రాష్ట్రపతిపాలన నిర్ణయంపై శివసేన మండిపడింది. ఓ వైపు ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీకి ఇచ్చిన గడువు పూర్తి కాక ముందే రాష్ట్రపతి పాలనకు ఎలా సిఫార్సు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ తో చర్చించిన ఆ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.


బ్రిక్స్ పర్యటన కోసం బ్రెజిల్ వెళ్తున్న ప్రధాని మోడీ.. అంతకుముందే ఈ కేబినెట్ సమావేశం నిర్వహించి రాష్ట్రపతి పాలనకు ఓకే చెప్పేసినట్టు తెలుస్తోంది. మొన్నటి మహారాష్ట్ర ఎన్నికల్లో కలసి పోటీ చేసిన బీజేపీ- శివసేన.. ఎన్నికల తర్వాత మాత్రం ఆ స్నేహం కొనసాగించలేకపోయాయి.


ముఖ్యమంత్రి పదవిని పంచుకునే విషయంలో శివసేన పట్టుబట్టగా బీజేపీ మాత్రం ససేమిరా అన్నది. చివరకు మళ్లీ ఎన్నికలకు వెళ్లేందుకైనా సరే రెండు పార్టీలు సిద్ధపడటంతో మహారాష్ట్ర రాజకీయం వారం రోజులుగా అనేక మలుపులు తిరిగింది. కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతుతో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలని శివసేన భావించినా సకాలంలో వేగంగా స్పందించలేకపోయింది.


కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతు లేఖలు సకాలంలో గవర్నర్ కు సమర్పించి ఉంటే.. ఆ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటై ఉండేది. కాంగ్రెస్ కూడా సకాలంలో నిర్ణయం తీసుకోలేకపోవడం కూడా రాష్ట్రపతి పాలనకు దారి తీసింది. ఇక సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్ ఒక్కటే శివసేనకు ఆశాకిరణం.


మరింత సమాచారం తెలుసుకోండి: