బయటి దేశానికి వెళ్లి డబ్బులు బాగా సంపాదించవచ్చనే ఆలోచన ఉన్న మహిళలకు ఈ సంఘటన ఒక కనివిప్పు కావాలి. ఇక్కడ ఉపాధి దొరకడం లేదని, పని చేయడం ద్వారా డబ్బులు సంపాదించుకోవడం లేదని నిత్యం ఎందరో మహిళలు బాధపడుతుంటారు. సౌదికి వెళ్లితే కాసులు బాగా సంపాదించవచ్చనుకుంటారు.


కాని ఆ దేశంలో మనుషులకు విలువ లేదని గ్రహించరు. ఆడవారినైతే తమ కామవాంఛల కోసం ఎంతగా హింసపెడతారంటే ఎందరో మాటల్లో చెప్పలేక మౌనంగా అక్కడున్నంత కాలం ఆ బాధలు అనుభవిస్తూ ఇక్కడి నుండి బ్రతికి ప్రాణాలతో మనదేశం వెళ్లితే చాలనుకుంటారు.


అక్కడ ఆడవాళ్లను నాప్‌కిన్ కంటే హీనంగా వాడేస్తారు. మరణించాక అనుభవించే నరకాన్ని సౌది లాంటి దేశాల్లో బ్రతికి ఉండగానే చూపిస్తారు. ఆ నరకం ప్రత్యక్షంగా అనుభవిస్తున్న ఓ మహిళ కన్నీటి వేదనతో తనని రక్షించాలని, వీడియో కాల్ ద్వారా వెల్లడించింది. బతుకుతెరువు కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన ఈమె అక్కడ తాను ఎదుర్కొంటున్న నరకయాతన. తన యజమానులకు తెలియకుండా రహస్యంగా మాట్లాడిన వీడియో కాల్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇకపోతే ఈ మహిళ బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తిగా తెలిసింది. ఇక సౌది పేరుకే డబ్బున్న దేశం కాని అక్కడ మగాళ్లూ అని చెప్పుకునే మృగాళ్లూ ఉంటారు. వారు చెప్పేది పని చేయడం కోసం అని, కాని చేపించుకునే పని మాత్రం తమ సెక్స్ కోరికలు తీర్చడం కోసమే, దేశం కాని దేశం విడిచి వెళ్లే మహిళల పని. దాదాపు అక్కడకు వెళ్లిన వారు కన్నీటితో ఎప్పుడు ఆ నరకం నుండి బయట పడుతామా అని కొన ఊపిరితో జీవిస్తారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో సార్లు మనం వినే ఉంటాం.


ఇకపోతే బంగ్లాదేశ్‌కు చెందిన 25 ఏళ్ల వయస్సు ఉన్న ఆ మహిళ తన యజమానులు లైంగికంగా వేధిస్తున్నారని, నిత్యం సెక్స్ చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని. ఇక్కడ ఎన్నాళ్లు బతకుతానో కూడా తెలీదు. దయచేసి నన్ను రక్షించండి అంటు వేడుకుంటుంది.. వీరు నన్ను  15 రోజుల నుంచి ఇంట్లో బంధించి, కనీసం తిండి కూడా పెట్టడం లేదు. మరిగిన నూనెలో ముంచి నా చేతులను కాల్చేశారు అని పేర్కొంది. అంతే కాకుండా నన్ను ఒక ఇంటి నుంచి మరో ఇంటికి తిప్పుతూ, తీవ్రంగా కొట్టి హింసిస్తున్నారు.  నేను ప్రాణాలతో ఉంటానని అనుకోవడం లేదు. చనిపోతాను అనిపిస్తోంది. ఇక్కడి నుంచి నన్ను తీసుకెళ్లండి’’ అని తెలిపింది.


ఈ వీడియో వైరల్ కావడంతో బంగ్లాదేశ్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ఆమె ఆచూకీ కనుగొనేందుకు చేసిన ప్రయత్నం ఫలించి బాదితురాలు  ప్రస్తుతం జెద్దాహ్‌లో ఉన్నట్లు తెలిసింది. ఇక త్వరలోనే ఆమెను బంగ్లాదేశ్‌కు తీసుకొస్తామని ఆ సంస్దవారు వెల్లడించారు. చూసారా అందమైన గులాభి వెంట ముళ్లున్నట్లే విదేశీ మోజులో పడే మహిళలకు ఇలాంటి అనుభవాలు కలుగుతాయి. అందుకే మనం జన్మించిన పుడమిపైనే చావైన, బ్రతుకైనా అనుకొని బ్రతుకే బ్రతుకులో డబ్బులు లేకపోయినా సుఖంగా జీవించవచ్చూ. 



మరింత సమాచారం తెలుసుకోండి: