ఏపీ సీఎం జగన్ ఏపీలో ఉన్న అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశ పెట్టాలని సంచలన నిర్ణయం తీసుకున్న సంగతీ తెలిసిందే. ఈ నిర్ణయంతో ప్రతిపక్షాలు కూడా భగ్గుమన్నాయి. అయితే ఇది ఆచరణలో ఎంత వరకు సాధ్యమని ఇప్పుడు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఈ నిర్ణయం పట్ల అనుకూలంగా, వ్యతిరేకంగా ప్రజల్లో చర్చ మొదలైంది. తెలుగును చంపేయడానికి తీసుకున్న నిర్ణయమంటూ కొందరు తీవ్రస్థాయిలో ఆందోళన చెందుతుంటే.. కెరీర్‌కు ఆంగ్లం ఎంతో ముఖ్యమైపోయిన ప్రస్తుత తరుణంలో ఇది చాలా మంచి నిర్ణయమంటూ సమర్థిస్తున్నారు మరికొందరు. మరికొందరు ప్రభుత్వ నిర్ణయం మంచిదే అయినా అందుకు తగ్గ పరిస్థితులు ఇంకా లేవని, తగిన వనరులు కల్పించి అమలు చేయాలని సూచిస్తున్నారు.ప్రస్తుతమున్న ప్రభుత్వ ఉపాధ్యాయులూ ఇదే విద్యావ్యవస్థ నుంచి వచ్చినవారు కావడం, ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు వారికి శిక్షణలు లేకపోవడంతో హఠాత్తుగా మొత్తం ఆంగ్లమాధ్యమంలోకి మార్చితే వారు బోధించగలుగుతారా అన్న ప్రశ్న వ్యక్తమవుతోంది.


అయితే ప్రస్తుతం ఉన్న సవాళ్లను అదిగిమించి ఎట్టి పరిస్థితిలో ఇంగ్లీష్ మీడియాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని అమల్లోకి తెచ్చి... ఆ తరువాత 2021 -22 విద్యాసంవత్సరం నుంచి 9 వ తరగతికి ఇంగ్లీష్ మీడియంలోనే బోధన జరగాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ మరుసటి సంవత్సరం నుంచి 10 వ తరగతికి కూడా అన్ని సబ్జెక్టులను ఇంగ్లీషులోనే చెప్పాలి. తెలుగు, ఉర్దూ ఇక భాషా సబ్జెక్టులుగా మాత్రమే ఉంటాయి. ఇక రాష్ట్రంలో విద్యాబోధన అంతా కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది.


కేవలం తెలుగు లేదా ఉర్దూ ఒక సబ్జెక్టు గా మిగతా సబ్జక్ట్స్ ఇంగ్లీష్ లో ఉంటాయి. ఏపీలో అన్ని మేనేజ్‌మెంట్ల పరిధిలో కలిపి 43 వేల గవర్నమెంటు స్కూళ్లు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 1500 ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలోనే విద్యాబోధన జరుగుతోంది. గత ఏడాది రాష్ట్రంలోని 7 వేల ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. ప్రస్తుతం 1 నుంచి 8 వ తరగతి వరకు మొత్తం మీద 8,500 పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమల్లో ఉంది. ఇప్పుడు సుమారు మరో 35 వేల పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: