రవాణా, సమాచార శాఖల మంత్రి పేర్నినాని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గాలి తీసేశారు. మీడియా సమావేశంలో పవన్ మాట్లాడుతు జగన్ పై మండిపడిన విషయం తెలిసిందే. జగన్ ను మూడు పెళ్ళిళ్ళు చేసుకోమన్నారు. విజయవాడలో వీధి గొడవలకు తాను సిద్ధమన్నారు. తాను అనుకుంటే జగన్ చాలా ఘోరంగా మాట్లాడగలను అంటూ హెచ్చరించారు. తాను మాట్లాడితే జగన్ తల కూడా ఎత్తుకోలేరంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

 

ఆ విషయాల మీదే పవన్ కు నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీడియా సమావేశంలో మాట్లాడుతున్నంతసేపు పవన్ ను నాని పవన్ నాయుడు, పవన్ నాయుడు అంటూ  పదే పదే సంభోదించటం  విశేషం. జగన్ గురించి పవన్ మాట్లాడిన ప్రతి మాటకు నాని కౌంటర్ ఇచ్చారు.

 

సరే రాజకీయాలన్నాక ఆరోపణలు, ప్రత్యరోపణలు మామూలే. కానీ పవన్ ను పవన్ నాయుడు అని పదే పదే పలకటమే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే గతంలో పవన్ గురించి ఎవరు మాట్లాడినా పవన్ ను పవన్ నాయుడు అని అనలేదు. తాజాగా నాని మాత్రం పవన్ ను అలా సంభోదించటం వెనుక ఆంతర్యమేంటి ?

 

ఏమిటంటే ఇక్కడ రెండు అంశాలున్నాయి.  మొదటిది పవన్, చంద్రబాబునాయుడు మధ్య ఉన్న ఫెవికాల్ బంధం గురించి ప్రస్తావించటం. చంద్రబాబు, పవన్ ఒకటే అని చెప్పటానికే నాని పవన్ ను పవన్ నాయుడు అని అన్నారని అనుకోవాలి. ఇక రెండో అంశం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కాపులను కూడా నాయుడు అనే అంటారు.

 

కాకపోతే ఇప్పటి వరకూ పవన్ ను ఎవరు పవన్ నాయుడు అని సంభోదించలేదు. ఇపుడే ప్రత్యేకంగా పేర్నినాని అలా అనటంలో పవన్ ను రెచ్చగొట్టటమే అని అర్ధమవుతోంది. చిన్న చిన్న విషయాలకే రెచ్చిపోయే పవన్ మంత్రి తాజా వ్యాఖ్యలకు ఏ స్ధాయిలో రియాక్ట్ అవుతారో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: