వైఎస్ కి చంద్రబాబుకి ఉన్న వ్యత్యాసాల్లో ప్రధానంగా చెప్పుకునేది సొంత జిల్లాల్లో వారికి ఎంత వరకు బలం ఉంది ? వైఎస్ ముఖ్యమంత్రిగా ఆలస్యంగా పదవి చేపట్టినా సరే ఆయన రాజకీయంలోకి వచ్చిన నాటి నుంచి కూడా జిల్లాలో నేతలు అందరూ కూడా ఆయన మాట జవదాటే వారు కాదు అనేది వాస్తవం. ఇక ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీని ఆయన జిల్లాలో ఎదగనీయలేదు. ఆ పార్టీ నేతలు కూడా వైఎస్ బలం చూసి చేతులు ఎత్తేసే పరిస్థితి ఉండేది అని... అప్పటి పరిస్థితులు చూసిన వారు చెప్పే మాట.


ఇక చంద్రబాబు విషయానికి వస్తే... ఆయనకు సొంత జిల్లాలో బలం ఎంత ఉంది అంటే..? చెప్పలేని పరిస్థితి. ఎన్టీఆర్ అల్లుడిగా టీడీపీ లో కీలక పాత్ర పోషించినా సరే ఆయన జిల్లాలో ఎక్కువగా బలం పెంచుకోలేకపోయారు. ఇక ముఖ్యమంత్రి అయినా సరే సొంత జిల్లాను కంచుకోట గా మార్చుకోలేకపోయారు. జిల్లా రాజకీయాల మీద అవగాహన ఉన్నా సరే ఆయనకు పట్టు చిక్కలేదు.


అంతెందుకు ఈ ఎన్నిక‌ల్లో కుప్పంలో చంద్ర‌బాబు ఒక్క‌రు మిన‌హా జిల్లాలో ఏ ఒక్క‌రు టీడీపీ నుంచి గెల‌వ‌లేదు. బొజ్జ‌ల‌, గాలి వార‌సులు కూడా ఘోరంగా ఓడిపోయారు. ఇప్పుడు ఆ పరిస్థితి మరింత దారుణంగా మారింది అనేది కొందరి వాదన. ఇటీవల చంద్రబాబు జిల్లా పర్యటనకు వెళ్లారు.
ఈ పర్యటనలో నేతలు ఆయన పర్యటన పట్ల ఆసక్తి చూపించలేదు. చంద్రగిరి, కుప్పం, పుంగనూరు, పలమనేరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు నియోజవర్గాల్లోని నేతలు ఆయన మీద నమ్మకంగా లేరని అంటున్నారు.


ఇటీవల ఆ నియోజకవర్గాల నేతలు చంద్రబాబు పర్యటనల పట్ల అంతగా ఆసక్తి చూపించలేదు అనేది టీడీపీ కార్యకర్తల మాట కూడా. రాజకీయంగా జిల్లాలో పార్టీకి బలం లేదు... ఇలాంటి పరిస్థితుల్లో నేతలు అనుసరిస్తున్న తీరు... అధినేతతో పాటు పార్టీ కార్యకర్తలను కూడా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. మరి వాళ్ళ అడుగులు ఏంటి అనేది చెప్పలేని పరిస్థితి.


మరింత సమాచారం తెలుసుకోండి: