బిజెపి చెలిమిని వదులుకుని శివసేన తప్పు చేసిందా ? ఇపుడిదే అంశంపై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో బిజెపి+శివసేన కలిసి పోటి చేశాయి. 288 సీట్ల అసెంబ్లీలో బిజెపికి 105 సీట్లు వస్తే శివసేన 56 సీట్లలో గెలిచింది. మామూలుగా అయితే మిత్రపక్షాల ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు కావటం నల్లేరు మీద బండినడక లాంటిదే.

 

అయితే హఠాత్తుగా సిఎం కుర్చి ముందుగా తమకే కావాలంటూ శివసేన పేచి మొదలుపెట్టింది. సీట్ల విషయంలో అతిపెద్ద పార్టీగా నిలిచిన బిజెపి ఇందుకు ససేమిరా కాదు పొమ్మంది. దాంతో ముఖ్యమంత్రి పీఠం కోసం రెండు పార్టీలో దేనికదే పట్టుదలకు పోవటంతో రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడింది.

 

ఎన్సీపి+కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కూడా శివసనేన వెనకాడలేదు. ఇందులో భాగంగానే శివసేన ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసింది. అయితే శివసేన పరిస్ధితి వ్రతమూ చెడింది ఫలితమూ దక్కలేదన్నట్లుగా తయారైంది. ఎందుకంటే శివసేన ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వానికి తాము మద్దతు ఇచ్చేది లేదని కాంగ్రెస్ తేల్చి చెప్పటంతో శివసేనకు పెద్ద షాక్ తగిలింది.

 

మొత్తం మీద చూస్తుంటే శివసేనకు అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి.  ప్రిస్టేజ్ విషయానికి పోతే గనుక ఎన్సీపి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు శివసేన సిద్ధపడటం మాత్రమే మిగిలుంది. అంటే అపుడు ముఖ్యమంత్రిగా ఎన్సీపి నేతే అవుతారనటంలో సందేహం లేదు. అదే జరిగితే సిఎం కుర్చీ తనకు దక్కనపుడు శివసేనకు బిజెపి అయితే ఏమిటి ? ఎన్సీపీ అయితే ఏమిటి ?

 

దశాబ్దాల మిత్రత్వాన్ని బిజెపితో తెగతెంపులు చేసుకుని శివసేన తప్పు చేసిందా అనే చర్చ మొదలైంది. ఏదో బిజెపిని దెబ్బకొట్టాలన్న టార్గెట్ మాత్రమే పెట్టుకున్నది కానీ అందుకు తగ్గ అవకాశాలను పరిశీలించలేదని తెలిసిపోతోంది.  తమకు ప్రభుత్వం ఏర్పాటులో అవకాశం రాకపోతే బిజెపి చూస్తు కూర్చుంటుందని శివసేన ఎలా అనుకుందో అర్ధం కావటం లేదు. కర్నాటకలో ఏం జరిగిందో చూసిన తర్వాత కూడా శివసేనకు బుద్ధి రాకపోతే ఎవరూ చేయగలిగేదేం లేదు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: