అయోధ్య భూ వివాదంపై సుప్రీమ్ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి విదితమే. రామ మందిర నిర్మాణానికి పచ్చ జెండా ఊపడంతో హిందువులు ఎంతో సంతోషపడ్డారు. అయితే వాళ్ళ అందరికంటే మహా మిక్కిలి గా సంతోషపడింది ఎవరంటే.. మహారాష్ట్ర కి చెందిన 81 ఏళ్ళ మాజీ సంసృతం టీచర్ ఉర్మిలా చతుర్వేది.


కారణమేంటంటే, 1992 లో బాబ్రీ మసీద్ ను కరసేవకులు కూల్చి వేశారు. దాంతో ఆమెకు రాముడి గుడి నిర్మిస్తారనే ఆశ, నమ్మకం దృఢపడింది. కానీ ఆ సమయంలో అల్లర్లు జరిగి చాలా మంది చనిపోయారు. ఈ దారుణమైన ఘటన ఆమె మనసుని కలిచివేసింది. దాంతో ఆ రోజు నుంచి రాముడి గుడి నిర్మాణం మొదలైయే వరకు ఆహారం ముట్టనని ప్రతిజ్ఞ తీసుకుంది.


ఈ బామ్మా కుమారుడైన అమిత్ చతుర్వేది చెప్పిన ప్రకారం.. 
ఈ మహా రామ భక్తురాలు 27 సంవత్సరాలుగా కేవలం పాలు, పండ్లు మాత్రమే తింటుంది. ఇలా పాలు పండ్లు తీసుకోవడం ఆమె తన 54వ సంవత్సరంలో ప్రారంభించిందంట. ఆమె స్నేహితులు బంధువులు దీక్షను మానమని ఎంత చెప్పిన వినలేదంట. రాముడి కి పెద్ద భక్తురాలు అయినా ఊర్మిళ చతుర్వేది చాలా సంవత్సరాల నుంచి తీర్పు కోసం వేచిచూస్తుందని. అయితే ఇటీవల సుప్రీమ్ కోర్టు రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పునివ్వడంతో తన అమ్మ చాలా సంతోషించారని అమిత్ చతుర్వేది చెప్పాడు.


సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి కి కృతఙ్ఞత లేఖను వ్రాసి పంపిస్తునట్లు అమిత్ చెప్పాడు. త్వరలోనే 'ఉద్యాపన' అనే వేడుకని ఏర్పాటు చేసి ఆమె తన 27 ఏళ్ళ ఉపవాసాన్ని ముగిస్తుందంట. నిజానికి ఈ బామ్మా చాలా గట్టిదే ఎందుకంటే అన్నీ ఆహార కోరికలను చంపుకొని 27 సంవత్సరాలు కేవలం పాలు పండ్లు తిని బ్రతకడమంటే చాలా కష్టమే.


మరింత సమాచారం తెలుసుకోండి: