డబ్బు సంపాదించాలంటే కష్టమైన పనే చేయాలని ఏం లేదు. దీనికి బోలెడన్ని మార్గాలున్నాయని ఈ నాటి యువత నిరూపిస్తున్నారు. కొందరు బిజినెస్ ద్వారా సంపాదిస్తుంటే మరి కొందరు తమకున్న తెలివితేటలను పెట్టుబడిగా పెట్టి సంపాదిస్తున్నారు. మరికొందరు మాత్రం హాయిగా ఇంట్లోనే తింటూ లక్షల్లో సంపాదన తెచ్చుకుంటున్నారు.


ఇక ఈ మద్యకాలంలో ప్రతి వారు యూట్యూబ్‌ చానల్ పెట్టగా అందులో కొందరు సక్సెస్ బాటపట్టి వారి ఆదాయాన్ని పెంచేసుకుని ఆనందంగా గడుపుతున్నారు. వీరిలాగే ఓ యువతి ఇంట్లో కూర్చూనే నచ్చినవి తింటూ కావలసినన్ని డబ్బులను సంపాదిస్తుంది. ఇంతకు ఈమె ఎక్కడుంటదో, పేరేంటో అని చూస్తున్నారు కదా! అక్కడికే వస్తున్నా ఈమె పేరు చర్నా రైలీ(22) ఉండేది లండన్‌లో.. ఈ యువతి ఏదో సరదాగా కొన్ని యూట్యూబ్‌ వీడియోలను పెట్టింది. ఆ చానల్ క్రమక్రమంగా పుంజుకోవడంతో తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి ఫుల్ టైం తన యూట్యూబ్‌ చానల్ కోసమే పనిచేస్తుంది.


ఇందులో వింతేముంది అంటారా అక్కడికే వస్తున్నా తన యూట్యూబ్ చానల్‌లో ఆమె చేసే కంటెంట్ గురించి తెలిస్తే మాత్రం ఎవరైనా షాకవ్వాల్సిందే. అదేమంటే చర్నా తనకు బాగా ఇష్టమైన ఫుడ్‌ను తింటూ..  ఆ వీడియోలను తన యూట్యూబ్ చానల్‌లో అప్‌లోడ్ చేయడమే ఆమె పని. వినడానికి వింతగా ఉన్నప్పటికీ.. సరదాగా ప్రారంభించిన ఈ పనిని ఇప్పుడు నిత్యం 40వేల మంది వరకు ఈ వీడియోలను చూస్తున్నారట.


తన వీడియోలకు ఈ స్థాయిలో స్పందన వస్తుండటంతో.. చర్నా చేస్తున్న ఉద్యోగానికి స్వస్తి చెప్పి యూట్యూబ్ వీడియోలకే ఫుల్ టైంను కేటాయించేసింది. రోజంతా పిజ్టాలు, బర్గర్‌లు తింటూ.. ఆ వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తూ వాటిపై ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. నిజంగా ఈమె జాబ్ ఎంత హయిగా ఉందో అనుకుంటున్నారు కొందరు సోమరిగా తిరిగే వారు. ఇక ఇలా తింటూ కూర్చోని సంపాదిస్తే ఇప్పుడు డబ్బు వస్తుంది, కొన్ని రోజులు ఆగితే జబ్బు వస్తుంది. . అని తెలుసుకోండి అంటున్నారు నెటిజన్లు కొందరు...


మరింత సమాచారం తెలుసుకోండి: