ప్రస్తుతం యూట్యూబ్ ప్రపంచాన్ని ఏలుతున్నది అనడంలో అతిశయోక్తి లేదు. ఎంతోమంది యూట్యూబ్ లోనే  బతికేస్తుంటారు. వీడియోలు చూస్తూ ఎంటర్టైన్మెంట్ పొందుతూ యూట్యూబ్ లోనే టైం మొత్తం స్పెండ్ చేస్తూ ఉంటారు.ఇంకొంత మంది  యూట్యూబ్ వృత్తిగా మార్చుకుంటారు.  యూట్యూబ్ వృత్తిగా మార్చుకుంటున్న  వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం యువత మొత్తం నూతన వరవడులు తొక్కుతోంది  . ఏదో ప్రైవేట్ కంపెనీకెళ్ళి ఎవరో  కింద జాబ్ చేయడం ఎందుకు... మనమే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని పాపులర్ అయిపోయి డబ్బులు సంపాదిస్తే అయిపోతుంది కదా అన్నట్లుగా నేటి యువత ఆలోచన ఉంది. దీంతో  యూట్యూబ్ లో ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. 



 నగరాల్లో ఉండే యువతే కాదు గ్రామాల్లో ఉండే యువత కూడా వినూత్న ఆలోచనలు చేస్తున్నారు యూట్యూబ్ లో బాగా ఫేమస్ అయ్యి  తర్వాత భారీగానే డబ్బులు సంపాదిస్తున్నారు. ఓవైపు పాపులారిటీ మరోవైపు ఇష్టమైన పని  చేస్తున్నామనే  సంతోషం ఇంకోవైపు ఉద్యోగం చేసిన దాని కంటే ఎక్కువ డబ్బు... ఇక ఇంకేం కావాలి అన్నట్లు అందరూ యూట్యూబ్ లో వీడియోలు చేయడమే వృత్తిగా ఎంచుకున్నారు. అయితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఎంటర్ టైన్మెంట్ పంచుతూ యూట్యూబ్ లో పాపులారిటీ పొంది  డబ్బులు సంపాదిస్తున్నారు. ఇక్కడ ఓ యువతి అదే చేసింది. తన వీడియోలకు యూట్యూబ్ లో వస్తున్న పాపులారిటీ చూసి మురిసిపోయిన ఓ బ్రిటన్ యువతి ఏకంగా  తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. 



 ఇంతకీ  ఆ యువతి యూట్యూబ్ లో ఎలాంటి వీడియోలు పెడితుందో  తెలుసా... రోజు మొత్తం పిజ్జాలు తింటున్న వీడియోలు. దీంతో ఈ అమ్మడు యూట్యూబ్ వీడియోలు బాగా పాపులారిటీ అయ్యి డబ్బులు కూడా బాగానే వస్తున్నాయి. అయితే రుచికరమైన తిండి పాపులారిటీ డబ్బు ఈ మూడు దొరుకుతుండడంతో లండన్ కు  చెందిన 22 ఏళ్ల చర్న రైలీ  అనే యువతి ఏకంగా ఉద్యోగాన్ని వదిలేసింది. యూట్యూబ్ ఉండగా ఉద్యోగం ఎందుకు దండగ అన్నట్లుగా ఈ భామ  ఆలోచించింది. రోజు ఫుల్ గా పిజ్జాలు తింటూ ఇంట్లో ఉంటూ ఆ  వీడియోలను యూ ట్యూబ్ లో పోస్ట్ చేస్తే సరిపోతుంది కదా అనుకుంది. అయితే యువతి పోస్ట్ చేసిన వీడియోలను ప్రతిరోజు 40 వేల మందికి పైగా చూస్తున్నారు. నెటిజన్ల నుంచి ఆదరణ కూడా మంచిగా లభిస్తుండడంతో ఈ అమ్మడు రోజు బాగానే పిజ్జాలను  లాగించేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: