2019 ఎన్నికల్లో చంద్రబాబు జిమ్మిక్కులను ప్రజలు భరించలేక భారీ తేడాతో టీడీపీని ఓడించి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అయినా చంద్రబాబు తన జిమ్మిక్కులను మానడం లేదు. అదే కామెడీని షురూ చేస్తున్నారు. ఏపీలో ఇసుక కొరతకు కారణం తెలిసినా.. యాగీ చేస్తూ.. ప్రజల్ని పక్కదారి పట్టించే చంద్రబాబు.. తాజాగా ఇసుక విషయంలో తాను చేసిన హెచ్చరికకు ఏపీ ప్రభుత్వం కదిలిపోయినట్లుగా ఆయన చెబుతున్న మాటలు కామెడీ కోటల్ని దాటేస్తున్నాయి. అనుకోని రీతిలో వర్షం ఎక్కువగా పడటం.. వరద పోటు ఎక్కువగా ఉండటం.. ఇది కాస్త ఎక్కువ రోజులు సాగటంతో ఇసుక కొరత తీవ్రమైంది.వరద కారణంగా పెరిగిన ఇసుక కొరతపై వాస్తవాలు తెలిసినా.. పొలిటికల్ మైలేజీ కోసం బాబు అండ్ కో చెప్పిన అబద్ధాలు అన్ని ఇన్ని కావు.


ఇలా చంద్రబాబు అండ్ కో అబద్దాలను భరించలేక ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారు. ఇదిలా ఉంటే.. వరద పోటు తగ్గిన కారణంగా ఇసుక కొరత తగ్గుతూ.. ఉత్పత్తి పెరుగుతోంది. వాస్తవానికి పది రోజుల క్రితం నుంచి ఇసుక ఉత్పత్తి పెరగటమ కాదు.. వరద పోటు తగ్గటంతో నెల రోజుల వ్యవధిలో ఇసుక సమస్య సాధారణ స్థాయికి తగ్గిపోతుందన్న మాటను జగన్ ప్రభుత్వం చెబుతోంది.అయినప్పటికీ ఈ విషయాల్ని పట్టించుకోని చంద్రబాబు ఈ నెల 14న విజయవాడలో ఇసుక కొరత మీద 12 గంటల పాటు దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. ఇసుక కొరత తగ్గిపోతూ..మరికొద్ది రోజుల్లో యథాతధ స్థితికి చేరుకుంటుందన్న వేళలో బాబు దీక్ష డేట్ ను ప్రకటించటంపై పలువురు తప్పు పడుతున్నారు.


చంద్రబాబు ఇప్పుడున్న పరిస్థితిలో దీక్ష చేస్తే ఇంకా నవ్వులపాలు కావటం ఖాయమని చెప్పాలి. ఇలాంటి వేళ.. మరింత కామెడీగా ఆయన తాజా వ్యాఖ్యలు ఉన్నాయి. తాను దీక్ష డేట్ అనౌన్స్ చేసిన వెంటనే ఇసుక అందుబాటును స్వల్పంగా పెంచినట్లు చెప్పారు.అంతేకాదు.. తన దీక్షను దెబ్బ తీసేందుకే తాను ప్రకటించిన డేట్ రోజునే ఇసుక వారోత్సవాల ప్రకటనను చేశారన్నారు. ఇసుక కొరత అన్నది ఏపీ చరిత్రలో లేదని అని చెబుతున్న చంద్రబాబు తన హయాంలో ఇసుక దోపిడీని మర్చిపోతున్నారని మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: