తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి ఖుష్బూ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 80వ దశకంలో తమిళంలో నెంబర్ వన్ హీరోయిన్ గా స్టార్ స్టేటస్ హోదాలో ఏలేసింది.  డేరింగ్ పర్సనాలిటీగానే కాకుండా ముక్కుసూటిగా మాట్లాడటం ఆమె నైజం. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు సమస్యలపై తన గళాన్ని గట్టిగా వినిపించే ఖుష్బూ ఉన్నట్టుండి తన ట్విట్టర్ ఖాతాను మూసేసింది.

 

ట్విట్టర్ లో ఆమకు మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. “నేను ట్విట్టర్ కు బానిసనై పోయాను అనిపించింది. తెల్లారి లేస్తే ఫోన్ తీసి ట్విట్టర్ అకౌంట్ చెక్ చేసుకోవడం సరిపోతోంది. దీని వల్ల నాకిష్టమైన పుస్తకాలు చదవడం మానేశాను. ట్విట్టరే లేకపోతే నేను చాలా పనులు చేయగలను అనిపించింది. ఈ వేదికను ప్రేమ, అనురాగాలు, శాంతి స్థాపనకు ఉపయోగించండి. విద్వేషాలకు కాదు. ఇది విరామం మాత్రమే. త్వరలోనే మిమ్మల్ని మళ్లీ కలుసుకుంటా. ట్రోలింగ్స్ కు భయపడేదానిని కాదు. కానీ నా వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం ముఖ్యం. నేనేంటో నాకు తెలుసు.” అంటూ తన అకౌంట్ ను క్లోజ్ చేసుకుంది. దక్షిణ భారత పరిశ్రమను ప్రధాని మోదీ విస్మరించడం తగదని ఇటివల ట్విట్టర్ లో పోస్ట్ చేసి తానెంత ఖచ్చితంగా ఉంటుందో నిరూపించింది.

 

వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో కూడా నిలిచింది ఖుష్బూ. పెళ్లికి ముందు సెక్స్ తప్పేమీ కాదు.. అనే మెసేజ్ తో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన ఖుష్బూ అప్పట్లో అనేక విమర్శలకు గురైంది. అయినా ఆమో తన ధైర్యంతో ప్రతి విమర్శను ఎదుర్కొంది. కాంగ్రెస్ పార్టీలో తమిళనాడుకు అధికార ప్రతినిధిగా ఉంటోంది. సమకాలీన రాజకీయాలపై, పలు సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తూ డేరింగ్ పర్సనాలిటీగా గుర్తింపు తెచ్చుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: