ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు జనసేన నాయకుడు, నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయ ప్రత్యర్థులపై ముఖ్యమంత్రి వ్యక్తిగత దాడులు చేయడం సిగ్గుచేటు, అవమానకరమని అన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “ఇంగ్లీష్ గ్లోబల్ లాంగ్వేజ్ అని నాకు తెలుసు, కాని యునెస్కో వంటి సంస్థ యొక్క నివేదికలు విద్యార్ధులు మొదటి ఐదేళ్ల విద్య కోసం తమ మాతృభాషలో చదివి వ్రాయాలని సలహా ఇస్తున్నాయి" అని చెప్పారు.
తెలుగు మాధ్యమం స్థానంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పునరాలోచించాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, "మీకు (జగన్) ఇంగ్లీష్ భాషపై అంత ప్రేమ ఉంటే, ఒక పని చేయండి, తిరుమల పూజారులు ప్రతిరోజూ సుప్రబాతం ఇంగ్లీషులో మాత్రమే చదివేలా చేయండి." అని జగన్ ను కోరారు. 
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మరియు పవన్ కళ్యాణ్‌పై ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలుగా మార్చాలనే చర్యను వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ టిడిపి అధ్యకుడు చంద్రబాబు ను ఉద్దెశించి, ”సర్, చంద్రబాబు గారు, మీ కొడుకు ఏ మాధ్యమంలో చదువుకున్నాడు? మీ మనుమడు ఏ మాధ్యమంలో చదువుతారు? సర్, వెంకయ్య నాయుడు, మీ కొడుకు మరియు మనవళ్ళు ఏ మాధ్యమంలో చదువుకున్నారు? అని ఘాటుగా స్పందించారు.
అంతే కాకుండా పవన్ పై సైతం ఘాటు వ్యాఖ్యలు చేశారు. "సర్, నటుడు పవన్ కళ్యాణ్ గారు. మీకు ముగ్గురు భార్యలు, నలుగురు ఐదుగురు పిల్లలు ఉన్నారు. వారు చదువుతున్న పాఠశాలల్లో బోధనా మాధ్యమం ఏమిటి?" అంటూ పవన్ ను అడిగారు. ఈ నేపథ్యంలో పవన్ జగన్ కు రిప్లై ఇచ్చినట్లు తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: