పవన్ కళ్యాణ్ సినిమా రంగంలో హీరోగా  ఉన్నపుడు ఆయన గురించి ఎవరికీ పెద్దగా తెలిసిందిలేదు. అయితే ఆయన యువరాజ్యం అధినేతగా పంచెలూడగొడతాను అంటూ రెచ్చిపొయిన తరువాతనే జనంలో పవన్ కోణం ఇదీ అని తెలిసింది. ఇక పవన్ 2014 తరువాత మెల్లగా తనలోని ఒక్కొక్క  కోణాలను జనాలకు తెలియచేస్తూ వస్తున్నారు. పవన్ రాజకీయం అంతా టీడీపీ  కోసం అన్నది బాగా ముద్ర పడిపోతోంది కూడా.


నిజానికి ఏపీలో పవన్ రాజకీయంగా బలపడాలంటే తనకు తానుగా సొంతంగా నిలదొక్కుకోవాలి. అయితే పవన్ లో ఆ రకమైన ఆలోచనలు  ఉన్నట్లుగా కనిపించడంలేదని వైసీపీ నేతలు అంటున్నారు. ఎంతసేపూ జగన్ని తిట్టడానికే పవన్ రాజకీయం చేస్తున్నాడన్నది నిన్నటివరకూ జనం నమ్మకపోయినా ఇపుడు బాగానే నమ్ముతున్నారు. దీనివల్ల నష్టం కచ్చితంగా పవన్ కళ్యాణ్ కేనని అంతా అంటున్నారు.


ఒకవేళ ఏపీలో జగన్ పాలన మీద వ్యతిరేకత కనుక వస్తే వారు ఆల్టర్నేషన్ గా చంద్రబాబును చూసుకుంటారు కానీ పవన్ని కాదని కూడా అంటున్నారు. అవును మరి పవన్ తన రాజకీయం తాను చేయకుండా చంద్రబాబుతో దోస్తీ కడితే మర్రి చెట్టుగా ఊడలు పాకిన తెలుగుదేశం రాజకీయం ముందు పవన్ ఎక్కడాఎదగలేడని  అంటున్నారు. ఇక పవన్ మాటలు, విమర్శలు, భాష విషయంలో కూడా ఇప్పటికీ  జాగ్రత్త పడకపోవడం మైనస్ పాయింట్ గా చెప్పుకుంటున్నారు.


ప్రజా జీవితంలో ఉన్నపుడు భాష చాలా ముఖ్యం. తాట తీస్తా, తోలు తీస్తా అన్న భాష మాత్రం ఇక్కడ అసలు కుదరదు, మంత్రి పేర్ని నాని ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ 
ఒక తాట తీస్తే  అవతల వైపు నుంచి పది మంది తాట తీసేందుకు రెడీగా ఉంటారని గుర్తుంచుకోవాలని అంటున్నారు. అసలు పవన్ డైలాగులు సినిమా ఫక్కీలో ఉన్నాయని కూడా వైసీపీ నేతలు అంటున్నారు. పవన్ని మొత్తానికి సినిమా నటుడుగానే చూస్తున్నారు. ఇపుడు ఇదే జనంలోకి పోతోంది. పవన్ కనుక ఇకనైనా జాగ్రత్తగా మాట్లాడకపోయినా, సొంత రాజకీయం చేయకపోయినా కూడా జనసేనకు  ఇబ్బందులు తప్పవన్న రాజకీయ విశ్లేషణలు కూడా వున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: